
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు వేసేందుకు కేంద్రం సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తోంది. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, చత్తీస్‌గఢ్ సీఎం భాఘెల్, బిహార్ సీఎం నితీష్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.
ఈ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించనున్నారు. మావోయిస్టు ప్రాంతాల్లో భద్రత, అభివృద్ధి, గిరిజనుల హక్కుల పరిరక్షణ, మావోయిస్టు ప్రాబల్యం కలిగిన 105 జిల్లాల్లో అత్యంత ప్రభావితం కలిగిన 35 జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇక తూర్పు తెలంగాణలోని భూపాలపల్లి, మహబూబ్‌బాబ్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో కొంతకాలంగా మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. 22 రోజుల్లో ఇద్దరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment