కరోనా: పోలీసుల అప్రమత్తతతో అంతా సేఫ్‌! | Uttar Pradesh Cops Stop Groom Found Coronavirus Positive | Sakshi
Sakshi News home page

కరోనా: పోలీసుల అప్రమత్తతతో అంతా సేఫ్‌!

Published Sat, Jun 20 2020 9:40 PM | Last Updated on Sat, Jun 20 2020 10:19 PM

Uttar Pradesh Cops Stop Groom Found Coronavirus Positive - Sakshi

ల‌క్నో: బాజా భజంత్రీలతో పెళ్లి మండపంలోకి వెళ్తున్న వరుడిని అనూహ్యంగా పోలీసులు అడ్డుకున్నారు. పెళ్లి కొడుక్కి, అతని తండ్రికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుడు, అతని తండ్రిని ఐసోలేష‌న్ సెంట‌ర్ కు త‌ర‌లించారు. మ‌రో ప‌ది మందిని హోం క్వారంటైన్ లో ఉండాల‌ని సూచించారు. ఈ పరిణామం ఉత్తరప్రదేశ్‌లోని బ‌రాబంకి జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
(చదవండి: కరోనా చికిత్స: మార్కెట్లోకి ఫబిఫ్లూ ఔషదం)

వివరాలు.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీకి చెందిన ఓ కుటుంబం ఢిల్లీలో నివాసముంటోంది. ఆ కుటుంబంలోని ఓ యువ‌కుడికి తాజాగా పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో జూన్ 15న వారంతా అమేథికి వ‌చ్చి పెళ్లి ఏర్పాట్ల‌లో మునిగారు. అయితే, ఢిల్లీ నుంచి వ‌చ్చిన ఆ కుటుంబానికి జూన్‌ 16న క‌రోనా ప‌రీక్ష‌లకు ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించారు. వాటి ఫలితాలు శుక్రవారం సాయంత్రం వెల్లడయ్యాయి. పోలీసులు అప్రమత్తమై అప్పటికే పెళ్లికి సిద్ధమైన ఆ కుటుంబాన్ని అడ్డుకోవడంతో వ‌ధువుతో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. 
(చదవండి: ఈ పాపులర్‌ యాప్స్‌ అన్నీ చైనావే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement