
లక్నో: ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. విధి ఆ కుటుంబాన్ని చిన్న చూపు చూసింది. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన యువతిని దురదృష్టం వెంటాడింది. పెళ్లై పట్టుమని పది రోజులు కూడా గడవకముందే భర్త చనిపోయాడు. ఆ దుఖం నుంచి కోలుకోకముందే మరో షాకింగ్ విషయం వెలుగు చూసుంది. బాధితురాలి కుటుంబంలో ఆమెతో సహా మరో 8మందికి కరోనా సోకింది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బాధితురాలి భర్తకి కోవిడ్ నెగిటివ్‌గా తేలింది. దాంతో తమకు మహమ్మారి ఎవరి వద్ద నుంచి సోకిందో తెలియక ఆ కుటుంబం ఆందోళన చెందుతుంది. (రాత్రి చితక్కొట్టి: పొద్దున అల్లుడ్ని చేసుకున్నారు)
ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీతా కుల్‌శ్రేష్టా మాట్లాడుతూ.. ‘బాధితురాలి భర్త పెళ్లై పది రోజులు తిరక్కుండానే మరణించాడు. పెళ్లైన వెంటనే అస్వస్థకు గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 4న మరణించాడు. ఆ తర్వాత మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా అతడికి కరోనా నెగిటివ్ వచ్చింది. దాంతో మరణించిన అతడి వల్లనే వీరందరికి కోవిడ్ సోకిందనడానికి లేదు. ఇక బాధితురాలి కుటుంబంలో ఆమెతో పాటు అత్త, బావ మరికొందరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేసే పనిలో ఉన్నాం. ప్రస్తుతం ఈ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment