
తెహెరి : మంత్రివర్గ సమావేశాన్ని నడుస్తున్న బోటులో నిర్వహించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. బుధవారం మంత్రులతో కలిసి తెహెరి సరస్సులో వెళ్తున్న బోటులో క్యాబినెట్ సమావేశం నిర్వహించి కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పూలతో అందంగా అలంకరించిన బోట్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రయాణిస్తూ పలు విషయాలను చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.



Comments
Please login to add a commentAdd a comment