Tehri district
-
చిరుత దాడిలో ఏడేళ్ల చిన్నారి మృతి
డెహ్రాడూన్ : ఏడేళ్ల బాలికపై చిరుతపులి దాడిచేసిన ఘటన ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో చోటుచేసుకుంది. దీంతో నెల రోజుల్లోనే చిరుత దాడిలో మరణించిన చిన్నారులు సంఖ్య ఐదుకి చేరింది. వివరాల ప్రకారం..ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో కాలకృత్యాల కోసం బాలిక బయటక వెళ్లగా చిరుతపులి దాడిచేసింది. తీవ్రగాయాలపాలైన చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయించిందని అటవీ విభాగం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎస్ మీనా తెలిపారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించామని ఆమె పేర్కొన్నారు. చిరుత దాడిలో గ్రామంలో ఇప్పటివరకు ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబరు 24వతేదీన మొదటిసారి ఇంటిబయట ఆడుకుంటున్న బాలికపై చిరుత దాడిచేసింది. వరుస ఘటనల నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. (విడిపోయేందుకు బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు) -
విభిన్నం: బోటులో క్యాబినెట్ మీటింగ్
తెహెరి : మంత్రివర్గ సమావేశాన్ని నడుస్తున్న బోటులో నిర్వహించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. బుధవారం మంత్రులతో కలిసి తెహెరి సరస్సులో వెళ్తున్న బోటులో క్యాబినెట్ సమావేశం నిర్వహించి కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. పూలతో అందంగా అలంకరించిన బోట్లో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రయాణిస్తూ పలు విషయాలను చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. -
కారు లోయలో పడి నలుగురు మృతి
ఉత్తరాఖండ్ తేహ్రీ జిల్లాలో కారు లోయలో పడి నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు శనివారం వెల్లడించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రుడు చంబ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. గత అర్థరాత్రి చంబ - ముస్సోరి రహదారిపై వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి చౌపారియల్ గ్రామ సమీపంలోని లోయలో పడిందని తెలిపారు. ఆ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.