కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ది ఎంటో చెప్పడం లేదంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే విమర్శించారు.
జైపూర్: కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ది ఎంటో చెప్పడం లేదంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే విమర్శించారు. రాజస్థాన్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరు పార్టీలు విమర్శలకు పదునుపెట్టాయి.
గత 8-9 నెలల తమ పాలన గురించి కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని, అయితే వారు 50 ఏళ్ల పాలనలో ఏంచేశారో చెప్పడం లేదని వసుంధర రాజే అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో్ పాల్గొన్న ఆమె.. సామాన్యుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు.