
వాట్సాప్...హ్యాట్సాప్
సాయం చేయడానికి ఎన్నో దారులు ఉన్నాయని నిరూపించాడు వేలూరు మెడికల్ కళాశాల విద్యార్థి రాహుల్‌జా(36).
తిరువళ్లూరు: సాయం చేయడానికి ఎన్నో దారులు ఉన్నాయని నిరూపించాడు వేలూరు మెడికల్ కళాశాల విద్యార్థి రాహుల్‌జా(36). చెన్నైకు చెందిన రాహుల్‌జా, వేలూరులోని వీఐటీలో పీజీ చేస్తున్నాడు. వరదల ద్వారా చెన్నైలో ప్రజలు పడుతున్న అవస్థలను గుర్తించి తన వంత సాయం చేయాలని చెన్నైకు చేరుకున్నాడు. గురువారం రాత్రి వాట్సాఆప్‌లో మెసేజ్ పంపాడు. గర్భిణులు, డయాబెటిస్, అల్సర్ వ్యాధులు వున్న వారు తననూ సంప్రదించాలన్న సారాంశం గంటల్లో వ్యాపించింది. రాత్రంతా 900 ఫోన్‌కాల్స్ వచ్చాయి.
వారికి సలహలు ఇచ్చాడు. దగ్గరిలోని వారికి తన స్నేహితుల ద్వారా మందులను పంపిణీ చేసాడు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం నాలుగు గంటల వరకు 18 మందికి ఉచిత ప్రసవ వైద్యం చేసాడు రాహుల్‌జా. ప్రజల దృష్టిలో వైద్యుడే కానీ.... గురువారం రాత్రి అంధకారంలో చిక్కుకుని సాయం పొందిన వారికి మాత్రం దేవుడే.
డాక్టర్ కాదు....
అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్...కానీ డజను మంది ప్రాణాలను కాపాడాడు. చెన్నైకు చెందిన ఆదిత్యావెంకటేష్ (25). బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. గత ఆదివారం చెన్నైకు వచ్చిన అదిత్య వరదల్లో చిక్కుకున్నాడు. మూడవ అంతస్తులో వున్న ఆదిత్య తన ఇంటికి కింద నిలబడిన గర్భిణులను చూసి చలించిపోయాడు. కొందరికి వైద్యం అవసరం. మరి కొందరికీ వైద్యశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ డబ్బు అవసరం అని గుర్తించాడు.
విదేశాల్లో వున్న తన మిత్రులకు మెసేజ్ పెట్టాడు. చెన్నైలోనీ అందుబాటులో వున్న వైద్యశాలలకు ఎక్కడికైనా వెళ్లండి. గర్భిణులకు అయ్యే ఖర్చును తామే భరిస్తాననీ మెసేజ్ పెట్టాడు. దాదాపు 30 మందికి వైద్యసాయం చేసాడు. ఆదిత్య డాక్టర్ కాదూ...కానీ 30 మందిని కాపాడాడు.