
బీజేపీ బాహుబలి మోదీయే..
ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో బీజేపీ బాహుబలి నరేంద్ర మోదీయే అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మధ్యంతర ఎన్నికలు వస్తాయనే వాదన ఆధార రహితం.. మేము 2019లోనే సహజంగా సాధారణ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామన్నారు.
రేపటి నుంచి అమలులోకి రానున్న రియల్ ఎస్టేట్ రెగ్యులరైజేషన్ యాక్ట్‌ను అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలుచేయాలని చెప్పారు. ఈ చట్టం ద్వారా స్థిరాస్తి వ్యాపారంలో కొనుగోలుదారే రారాజుగా ఎదుగుతాడని అన్నారు.