న్యూఢిల్లీ: నిరుద్యోగం.. మనిషిని కుంగదీస్తుంది. భవిష్యత్తుపై బెంగను కలిగిస్తుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్లేంతవరకు అక్కడెలాంటి ప్రశ్నలు అడుగుతారో, సెలక్ట్ అవుతామో లేదోనన్న భయం ప్రతిఒక్కరికీ వెంటాడుతూనే ఉంటుంది. తీరా ఉద్యోగానికి ఎంపిక అవకపోతే తల్లిదండ్రుల ముందుకు వెళ్లలేక ముఖం చాటేస్తారు. మానసికంగా కుమిలిపోతుంటారు. కానీ అలాంటి సమయంలో కొడుక్కు అండగా నిలిచాడో తండ్రి. 'ఇది కాకపోతే మరొకటి ప్రయత్నించొచ్చు లేరా..' అంటూ స్నేహితుడిలా భుజం తట్టి ప్రోత్సహించాడు. సుదర్శన్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం టీసీఎస్ జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లాడు. అక్కడ 1000 మందిని సదరు కంపెనీ ఎంపిక చేసుకుంది కానీ అందులో సుదర్శన్ లేడు. అతను దిగాలుగా ఎప్పటిలానే తిరిగి హాస్టల్‌కు చేరుకుని అదే ఆలోచనలతో నిద్రపోయాడు. తెల్లవారి లేచేసరికి అతని తండ్రి నుంచి ఓ ఉత్తరం వచ్చింది.. ఈ మెయిల్‌లో. (చైనాతో యుద్ధానికి నేను సైతం.. రాష్ట్రపతికి రక్తంతో..)
"మరేం దిగులుపడకు. నీ వంతు ప్రయత్నం నువ్వు చేశావు. నీకు మంచి విద్యార్హత ఉంది. ప్రపంచంలో ఇంకా అనేక అవకాశాలున్నాయి. వాటివైపు చూడు, ఆ దేవుడు నీకు తప్పకుండా మంచి దారి చూపిస్తాడు. ఇప్పటికే నీ మెదడులో ఓ ప్రశ్న సుడిగుండంలా నిన్ను కబళిస్తోంది.. అందరికంటే నేను ఎందుకు వెనకబడిపోయాను అని! జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎదురైనప్పుడు ఇలానే అవుతుంది. కావాలంటే ఇంకా చదువుకో, ఇంటికి రా, కొంచెం బ్రేక్ తీసుకో.. అంతే కానీ ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోకు. అనుభవంతో చెప్తున్నా.. ప్రతి ఒక్కరికీ వారికంటూ ప్రత్యేకమైన జీవితం ఉటుంది." (దొంగతనం చేసిన మరుసటి రోజే..)
"నీకు తప్పకుండా మంచి ఉద్యోగం దొరుకుతుంది. కాబట్టి బాగా తిను, వేళకు పడుకో, ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోకు, జీవితాన్ని ఎంజాయ్ చెయ్. నువ్వు విద్యార్థి జీవితం నుంచి ప్రపంచంలో అడుగుపెడుతున్నావు. నీకు ఓపిక, శ్రమ అన్నీ అలవడాలి. వాటిని నువ్వు అనుసరిస్తే సెప్టెంబర్ 30 లోపు మంచి ఉద్యోగం దొరుకుతుంది. జీవితంలో కీలకమైన ఈ దశను మరొకరితో పోల్చుకోవడం అనే రోగంతో నాశనం చేసుకోకు" అని ప్రేమగా హెచ్చరిస్తూ, కొండంత ధైర్యాన్ని నింపాడు. ఈ లేఖను సుదర్శన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. కొడుకును ఇంకొకరితో కంపారిజన్(పోల్చుకోవడం) చేసుకోవద్దని ఇతను తప్ప ఏ తండ్రీ చెప్పడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (పొట్టపై 10 వేల తేనెటీగల గూడుతో..)
TCS took 1000 people and I got rejected. Going to back to the hostel room that day was a long back. I woke up next morning to see this email from my father.
— Sudharshan Karthik (@conradsuse) July 10, 2020
P.S. My friends were great as well. They were more concerned about me more than the fact they got jobs. https://t.co/37MEyRXCod pic.twitter.com/4Ly1Qfg2F6
Comments
Please login to add a commentAdd a comment