సాక్షి, న్యూఢిల్లీ : మహిళా ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త అందించింది. నిరుపయోగ సీట్ల (అన్‌యుటిలైజ్డ్ బెర్తులు) విషయంలో మహిళా కోటాను అమలు చెయ్యబోతోంది. దీని ప్రకారం రిజర్వేషన్ తర్వాత మిగిలిపోయిన సీట్లలో తొలి ప్రాధాన్యం మహిళలకు ఉంటుంది.
సాధారణంగా రైల్వే శాఖ రిజర్వేషన్ ఛార్ట్ తయారు చేసే సమయంలో సీట్లు మిగిలిపోతే వెయిట్-లిస్ట్‌లో ఉన్నవారికి కేటాయిస్తుంది. కోటా ప్రకారం తొలి ప్రాధాన్యం సీనియర్ సిటిజన్లకు.. తర్వాతి ప్రాధాన్యం ముందుగా ఎవరు బుక్ చేసుకునే వారికి ఉంటుంది. కానీ, ఇకపై ఆ జాబితాలో ముందుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ మేరకు ఫిబ్రవరి 15న రైల్వే బోర్డు ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది.
బెర్తులు మిగిలిపోయే సమయంలో సీట్ల కేటాయింపును లింగ నిష్పత్తి ద్వారానే కేటాయించాలని సర్క్యులర్‌లో పేర్కొంది. ముందు వృద్ధులకు, తర్వాత మహిళలకు సీట్లు కేటాయించాలి. త్వరలోనే ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ప్రస్తుతం అన్ని రైళ్లలో ఆరు లోయర్ బెర్తులు, ఏసీ3 టైర్-ఏసీ2 టైర్ లలో మూడు లోయర్ బెర్తులను సీనియర్‌సిటిజన్లు, మహిళా ప్రయాణికులు (45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే), గర్భవతులకు కేటాయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment