
ప్రధాని నరేంద్రమోదీని కలిసి ధన్యవాదాలు చెబుతున్న టామ్ ఉజున్నాలిల్
సాక్షి, బెంగళూరు : ఉగ్రవాదులు తనను బాగా చూసుకున్నారని కేరళకు చెందిన క్రైస్తవమత గురువు టామ్ ఉజున్నాలిల్ చెప్పారు. దాదాపు 17 నెలలపాటు ఉగ్రవాదుల చెరలో ఉన్న ఆయనను భారత ప్రభుత్వం, యెమెన్ ప్రభుత్వం కృషివల్ల సురక్షితంగా తిరిగి భారత్ చేరుకున్నారు. వచ్చి రాగానే తనను విడిపించినందుకు ధన్యవాదాలు చెప్పేందుకు ప్రధాని మోదీని కలిసిన ఆయన శుక్రవారం బెంగళూరుకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 'నేను ఏడ్వలేదు.. భయపడలేదు. నా జీవితం ఏమైపోతుందో అనే ఆందోళన కూడా చెందలేదు. వాళ్లు నన్ను ఇబ్బందులకు గురిచేయలేదు. వారు నన్ను పోషించారు. నాపట్ల దయతో వ్యవహరించారు' అని ఆయన ఉగ్రవాదులు ఇబ్బందులకు గురిచేశారా అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా చెప్పారు.