'కన్హయ్యపై గట్టి సాక్ష్యాలున్నాయి' | we have strong evidences against kanhaiah kumar, says delhi cp bassi | Sakshi
Sakshi News home page

'కన్హయ్యపై గట్టి సాక్ష్యాలున్నాయి'

Published Wed, Feb 17 2016 1:12 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

'కన్హయ్యపై గట్టి సాక్ష్యాలున్నాయి' - Sakshi

'కన్హయ్యపై గట్టి సాక్ష్యాలున్నాయి'

జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు వ్యతిరేకంగా తమ వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ స్పష్టం చేశారు. అందుకే అతడిని అరెస్టు చేశామని తెలిపారు. జేఎన్‌యూ వివాదం.. ఈ కేసు విచారణ తదితర అంశాలపై పీఎంఓకు ఆయన వివరణ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ వివాదంలో కేవలం జేఎన్‌యూ విద్యార్థులే కాక మరికొంతమంది బయటివాళ్లు కూడా ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఈ కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. తమవద్ద గట్టి ఆధారాలున్నాయని, ఎలాంటి పక్షపాతం లేకుండానే తాము ఈ కేసు విషయంలో ముందుకు వెళ్తున్నామని బస్సీ తెలిపారు. జేఎన్‌యూ అధికారులు తమతో పూర్తిగా సహకరిస్తున్నారని, దేశ సమగ్రత గురించి ఆలోచించేవాళ్లంతా ఈ కేసు దర్యాప్తులో తమకు సహకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనవైపు వేళ్లు చూపించేవాళ్లకు ఏమీ అర్థం కావట్లేదని అన్నారు. 'నువ్వు సృష్టించిన ప్రపంచానికి ఏమైందో చూడు దేవుడా.. ఎంత మారిపోయాడో ఈ మనిషి' అంటూ కవి ప్రదీప్ రాసిన కవిత తనకు గుర్తుకువస్తుందని బస్సీ చెప్పారు. ఓవైపు తాము కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుంటే జనం మాత్రం ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

మరోవైపు ఈ కేసు గురించి సుప్రీంకోర్టు కూడా స్పందించింది. తీవ్రవాద భావాలు దేశసుస్థిరతను దెబ్బతీస్తాయని, ప్రజలు కాస్త వివేచనతో వ్యవహరించాలని కోర్టు వ్యాఖ్యానించింది. పాటియాలా హౌస్ కోర్టు వద్ద జరిగిన ఘర్షణను ప్రస్తావిస్తూ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు. మనమంతా దేశభక్తులమేనని, మాతృదేశాన్ని అస్థిరపరిచే పనులు ఎవరూ చేయకూడదని వ్యాఖ్యానించారు. ఇక న్యాయవాదులు చట్టాన్ని తమ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement