
'సాక్ష్యాత్తు ప్రధానే సభలో అసత్యాలు చెపుతున్నారు'
బొగ్గు కుంభకోణంపై సాక్ష్యాత్తు ప్రధాని మన్మోహన్ సింగే సభలో అసత్యాలు చెపుతున్నారని బీజేపీ నేత వెంకయ్యనాయడు విమర్శించారు.
ఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై సాక్ష్యాత్తు ప్రధాని మన్మోహన్ సింగే సభలో అసత్యాలు చెపుతున్నారని బీజేపీ నేత వెంకయ్యనాయడు విమర్శించారు. బొగ్గు ఫైళ్ల కుంభకోణం సంబంధించి ప్రధాని అసత్యాలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బొగ్గు శాఖా మంత్రి పైశ్లు మాయమైయ్యాయని ఒప్పుకుంటే, వాటిని ప్రధాని సమర్ధిస్తున్నారన్నారు. బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వంతో బీజేపీ ఆమీతుమీకి తేల్చుకోవడానికి సిద్దంగా ఉందన్నారు. సోమవారం పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు జరిగిన అవమానంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలన్నారు.
బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడానికి వెనుక కుట్ర, కుమ్మక్కు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. 2006-09 మధ్య బొగ్గు శాఖ నిర్వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్‌ను రక్షించడానికే వాటిని మాయం చేశారని గతంలో రాజ్యసభలో బీజేపీకి చెందిన ఉప నాయకుడు రవిశంకర్ విమర్శించిన సంగతి తెలిసిందే.