న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో తీసుకువచ్చిన ఆధార్ పథకాన్ని తామూ కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ శుక్రవారం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తూ, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. ఈ పథకం రాజ్యాంగ బద్ధతను పరిశీలించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది.