‘యూపీ ఎన్నికల్లో తమకు స్పష్టమైన మెజార్టీ వస్తుంది. రాజకీయ నిపుణులు కూడా ఇదే అంగీకరిస్తున్నారు’ అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.
న్యూఢిల్లీ: ‘యూపీ ఎన్నికల్లో తమకు స్పష్టమైన మెజార్టీ వస్తుంది. రాజకీయ నిపుణులు కూడా ఇదే అంగీకరిస్తున్నారు’ అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ‘ఈస్ట్రన్ ఉత్తరప్రదేశ్ మీదుగా బీజేపీ పవనాలు బలంగా రాష్ట్రమంతటా వీస్తున్నాయని విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
శనివారం ప్రత్యేక విమానంలో మీడియాతో మాట్లాడిన ఆయన నేడు వారణాసిలో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీ జరిగిన తీరు, తరలివచ్చిన జనాలను చూస్తే బీజేపీకి ఎంత అనుకూలంగా ఉందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. శనివారం బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ర్యాలీని ప్రారంభించిన మోదీ కాళ భైరవ ఆలయం వరకు కొనసాగించారు.