రావణుడి కాళ్లు ఎందుకు తిరిగొచ్చాయి?
రామాయణంలో మనం ఇంతవరకు పెద్దగా వినని అంశాలను కూడా నాయకులు గుర్తుచేస్తున్నారు. లంకలో రామరావణ యుద్ధం జరిగినప్పుడు శ్రీరాముడు రావణాసురుడి చేతులు, కాళ్లు నరికేశాడని, రథం విరగ్గొట్టేశాడని.. కానీ ఆ తర్వాత కాళ్లు మాత్రం మళ్లీ రప్పించాడని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి అన్నారు. తన కోటలోకి తిరిగి వెళ్లిపోడానికి వీలుగా అలా ఎందుకు చేశాడు అంటూ ట్విట్టర్ జనాలకు ఆయన ఓ ప్రశ్న సంధించారు.
సాధారణంగా ఇంతకాలం తెలిసినదాని ప్రకారం, రావణాసురుడి కడుపులో ఉన్న అమృతభాండాన్ని ఛేదించిన తర్వాత రావణవధ జరిగిందంటారు. ఆ రహస్యాన్ని కూడా విభీషణుడు రాముడి చెవిలో వేసిన తర్వాతే రావణాసురుడు నేలకొరిగాడని చెబుతారు. కానీ సుబ్రమణ్యం స్వామి మాత్రం సరికొత్త అంశాలను చెబుతున్నారు.
PTs may remember Bhagwan Ram in the Lanka war chopped Ravan's arms, legs and chariot but restored his limbs to walk back to his palace. Why?
— Subramanian Swamy (@Swamy39) 22 June 2016