ఇద్దరి పిల్లలతో తల్లి ఆత్మహత్య | Woman commits suicide along with 2 kids by jumping into canal | Sakshi
Sakshi News home page

ఇద్దరి పిల్లలతో తల్లి ఆత్మహత్య

Published Tue, Jun 6 2017 4:52 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Woman commits suicide along with 2 kids by jumping into canal

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో దారుణం జరిగింది. భర్త వేదింపులు తట్టకోలేని ఓ మహిళ ఇద్దరు పిల్లలతో సహా కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కేడా జిల్లా కపద్వంజ్‌ తాలుకాలోని సలోడ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సీతా పర్మార్‌(45) తన కొడుకు నరేశ్‌(5), కూతురు గుడ్డి(3)లతో సహా గ్రామ సమీపంలోని నర్మదా నది కెనాల్‌లో దూకింది. ఉదయం కెనాల్‌లో శవాలు తేలియాడుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త వేదింపులతోనే వారు ఆత్మహత్య చేసుకున్నారని సీతా తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement