ప్రియుడి కళ్లముందే రెచ్చిపోయిన కామాంధులు | woman raped in Tamil Nadu | Sakshi
Sakshi News home page

ప్రియుడి కళ్లముందే రెచ్చిపోయిన కామాంధులు

Published Sat, Jul 19 2014 11:54 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

ప్రియుడి కళ్లముందే రెచ్చిపోయిన కామాంధులు - Sakshi

ప్రియుడి కళ్లముందే రెచ్చిపోయిన కామాంధులు

 హొసూరు/కృష్ణగిరి: కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన అత్యాచార పర్వం తమిళనాడుకు పాకింది. కళాశాల  విద్యార్థిని ప్రియుడితో ఏకాంతంగా ఉండగా నలుగురు అల్లరిమూకలు ప్రియునిపై దాడి చేసి, చేతులు, కాళ్లు కట్టిపడేసి, ప్రియుడి  కళ్లముందే సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత నగ్నంగా సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీయించుకొన్న కీచక పర్వం కృష్ణగిరి జిల్లా రాయకోట సమీపంలోని బోడంపట్టి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకొంది. దీనిపై విచారణ నిమిత్తం డీఐజీ అముల్‌రాజు, ఎస్పీ కణ్ణమ్మాళ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. జిల్లాలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనను సభ్యసమాజం తీవ్రంగా ఖండించింది.
 
 కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణానికి సమీపంలోని చందాపురం గ్రామానికి చెందిన యువతి (19) కృష్ణగిరిలోని కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కావేరిపట్టణం సమీపంలోని  వేలాంపట్టి గ్రామానికి చెందిన సేరన్ (24), ఆ యువతి ప్రేమించుకున్నారు. వీరిరువురూ శుక్రవారం సాయంత్రం కారులో రాయకోట సమీపంలోని బోడంపట్టి వద్ద ఏకాంతంగా మాట్లాడుకొంటుండగా రాయకోట హెచ్చంపట్టికి   చెందిన సుబ్రమణి(28), రాఘవేంద్రనగర్‌కు చెందిన  ప్రకాష్(24), రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన మణి(22), గిడ్డంబట్టికి చెందిన  ప్రకాష్(24) అక్కడికి చేరుకొని సేరన్‌పై దాడి చేశారు. అతడి చేతులు, కాళ్లు, కట్టిపడేసి నలుగురు ఆ యువతిపై  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రియుడి కళ్లముందే నగ్నంగా ఫొటోలు తీసుకోవాలని లేకుంటే చంపేస్తామని బెదరించి ఫొటోలు తీయించుకున్నారు.
 
 ఈ సంఘటనను చూసిన పశువుల కాపరి బోడంపట్టి సెల్లప్ప గ్రామస్తులకు సమాచారమందించాడు. దీంతో వారందరూ అక్కడికి రావడంతో నలుగురూ అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు యువతిని, సేరన్‌ను రాయకోట పోలీసులకు అప్పగించారు. పోలీసులు వీరిరువురిని  కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు రాత్రికి రాత్రే నిందితులు సుబ్రమణి, ప్రకాష్, మణి, ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. డీఐజీ అముల్‌రాజ్, జిల్లా ఎస్పీ కణ్ణమ్మాళ్, డెంకణీకోట డీఎస్పీ రాధాకృష్ణన్, ఇన్‌స్పెక్టర్ పురుషోత్తమన్ శనివారం సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. ఆ యువతి, సేరన్‌లు వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వారు కావడం, నిందితులు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో జిల్లాలో కుల ఘర్షణలకు దారి తీస్తుందనే అనుమానంతో జిల్లాలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయకోట పరిసర ప్రాంతాల్లో ఈ సంఘటనపై స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. ఈ సంఘటనను సభ్య సమాజం తీవ్రంగా ఖండించింది.
 
 మద్యం తాగి...
 ఈ కేసులో పోలీసులు పలు విషయాలను సేకరించారు. కళాశాల విద్యార్థిని ప్రియునితో  కలిసి రాయకోట సమీపంలోని వజ్రం వంక ఆలయానికి కారులో వచ్చారు. మోడంపట్టి  వద్ద కారు ఆపి రోడ్డు పక్కన మామిడితోటకెళ్లారు. అక్కడ మద్యం తాగిన నలుగురు కలిసి, సేరన్‌ను కొట్టి చెట్టుకు కట్టేసి, అతని జేబులో ఉన్న రూ.1460 దొంగలించారు. సెల్‌ఫోన్, లాక్కున్నారు. ఒంటరిగా ఉన్న యువతి(19) మెడలో ఉన్న బంగారు గొలుసును, చెవి కమ్మలు, కాలి వెండి గొలుసులు లాక్కొని, అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
 
 వీరు మద్యం తాగి రాక్షసత్వంగా  ప్రవర్తించారని చెప్పారు. స్థానికులు బాధితులను రాయకోట  పోలీస్‌స్టేషన్‌కు  తీసుకురావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 12 గంటల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వీరి వద్ద బంగారు, వెండి, నగలు, సెల్ ఫోన్ డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్టు అయిన వారిలో రాయకోటకు చెందిన తమిళరసన్ కొడుకు ప్రకాష్ (26), మినీలారీ డ్రైవర్ వెంకటేశన్ కొడుకు మణి (27),హెచ్‌ఎంపట్టి గోపాల్ కొడుకు సుబ్రమణి  ఉన్నట్లు తెలిపారు. ధర్మపురి జిల్లా జిట్టాండళ్లికి చెందిన చిన్నకణ్ణు కొడుకు ప్రకాష్ (25) కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటన జరిగిన12 గంటల్లో నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంపై పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement