న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత శబరిమల అ య్యప్ప స్వామి ఆలయంలో మహిళలూ పూజలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎటువంటి వివక్షకు తావులేకుండా పురుషులతోపాటు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొంది. ఆలయంలోకి 10 నుంచి 50 మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై శబరిమల దేవస్వమ్ బోర్డు నిషేధం విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ పక్షాన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, అమికస్ క్యూరీగా రాజు రామచంద్రన్ వాదించారు. మహిళలను ఆలయంలోకి రానివ్వక పోవటం ప్రాథమిక హక్కులను నిరాకరించడం, అంటరానితనం పాటించడం వంటిదేనన్నారు. ఆల యంలోకి మహిళల అనుమతికి సంబంధించి ఎటువంటి చట్టాలు లేనప్పటికీ వారిని పూజలు చేయకుండా అడ్డుకోవటం వివక్ష చూపడమేనని కోర్టు పేర్కొంది. ‘ పురుషులకు ఉన్న చట్టాలే మహిళలకూ వర్తిస్తాయి. మహిళలకు ఆలయ ప్రవేశానుమతి చట్టాలపై ఆధారపడి లేదు. అది ఆర్టికల్స్ 25, 26 ప్రకారం రాజ్యాం గం కల్పించిన హక్కు’ అని తెలిపింది.
రాష్ట్రం లోని అన్ని ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ కేరళ ప్రభుత్వ లాయరు తెలపడంపై స్పందించిన కోర్టు.. ‘పిటిషనర్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదనలు వినాల్సిన అవసరం లేకపోవటం ఒక్కటే దీని వల్ల కలిగిన ప్రయోజనం. 2015లో ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించిన కేరళ ప్రభుత్వం.. రెండేళ్ల తర్వా త 2017లో అనుమతి నిరాకరించింది. కాలా న్ని బట్టి మీరు నిర్ణయాలు మార్చుకుంటున్నా రు’ అని వ్యాఖ్యానించింది.
ఇదే అంశంలో యంగ్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు కొనసాగనున్నాయి. మహిళలకు శబరిమల ఆ లయ ప్రవేశం నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది అక్టోబర్‌లో దాఖలైన పిటి షన్‌ను కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ బెంచ్ మహిళలను ఆలయం లోకి నిరాకరించడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందా లేదా అనే దానితోపాటు కీలకమైన అంశాలపై వాదనలు వింటుంది.
12 ఏళ్ల న్యాయపోరాటం
► 1965 నాటి కేరళలోని హిందూ ప్రార్థనా స్థలాల (ప్రవేశ అధికారం)నిబంధన 3(బి) కింద ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధానికి చట్టబద్ధత కల్పించారు.
► ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 2006లో ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. లింగభేదం ఆధారంగా పౌరుల పట్ల వివక్ష చూపరాదని, అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న రాజ్యాంగ నిబంధనకు ఇది విరుద్ధంగా ఉందని, మతాచారాలను పాటించే స్వేచ్ఛకు కూడా భంగం కలిగిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు.
► విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు అదే ఏడాది కక్షిదారులకు నోటీసులిచ్చింది.
► 2008 మార్చి7న ఈ కేసును త్రిసభ్య బెంచ్‌కు అప్పగించగా ఏడేళ్ల పాటు ఎలాంటి పురోగతీ లేదు.
► 2016 జనవరి 11న సుప్రీంకోర్టు బెంచ్ మళ్లీ కేసు విచారణను మొదలు పెట్టింది.
► కేసు విషయంలో కేరళ ప్రభుత్వం మూడుసార్లు తన వైఖరిని మార్చుకోవడం గమనార్హం. 2006లో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పిటిషన్‌ను సవాలు చేయరాదని నిర్ణయించగా, తర్వాత పగ్గాలు చేపట్టిన యూడీఎఫ్ సర్కారు మహిళలపై నిషేధాన్ని సమర్థించింది. మళ్లీ అధికారం చేపట్టిన ఎల్‌డీఎఫ్ తన పూర్వ వైఖరినే వ్యక్తపరిచింది.
► త్రిసభ్య బెంచ్ 2017లో కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment