సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయంతో తెలుగు వారంతా రాజన్న పాలన వచ్చిందన్న సంతోషంలో ఉన్నారన్నారు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కార్యదర్శి శ్రీదేవి రెడ్డి. ఏపీలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావటంతో వైఎస్సార్‌సీపీ నాయకులు నగరంలోని ట్రిప్లికేన్ ఎంస్ మహల్‌లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మజా రెడ్డి, సీనియర్ నేతలు శరత్ కుమార్ రెడ్డి, కె. కృష్ణా రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సదర్భంగా శ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి కావడం ద్వారా ఏపీలోని ప్రజలందరికి నవరత్నాలు అందుతాయని ధీమా వ్యక్తం చేశారు. జగన్ గెలుపు తమిళనాట బిక్కుబిక్కుమంటున్న లక్షలాది మంది తెలుగు ప్రజల జీవితాల్లో ఆనందం నింపిందని సంతోషం వ్యక్తం చేశారు. వేడుకకు వచ్చిన వారందరికి బిర్యానీలతో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్, వైఎస్ జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మారు మోగింది.
Comments
Please login to add a commentAdd a comment