
న్యూఢిల్లీ: జోమాటో పనికి మాలినదంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు ఆ సంస్థ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు జోమాటోపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘లాక్‌డౌన్‌లో నిత్యం ఫోన్‌తో ఆడుకుంటున్న నన్ను చూసి.. జోమాటో మాదిరిగా నేను కూడా ఎందుకు పనికిరానని నా తల్లిదండ్రులు భావిస్తున్నారు. వారు తెలివైన వారు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇది చూసిన జోమాటో ‘ప్రస్తుతం మేము కిరాణా సామగ్రిని కూడా పంపిణీ చేస్తున్నాం’ అని చమత్కారంగా సమాధానం ఇచ్చింది. (పానీ పూరీ లేదు.. ధైర్యంగా ఉండాలి!)
we're actually delivering groceries now, aap apna dekh lo 😘 https://t.co/7vCX3k6dAW
— Zomato (@ZomatoIN) April 13, 2020
ఇక జోమాటో ఇచ్చిన సమాధానికి నెటిజన్లు ఫిదా అవుతూ ‘వావ్.. గట్టి సమాధానం’ , ‘తెలివైన సమాధానం’ మరికొందరు లాక్‌డౌన్‌లో మేము జోమాటోలో ఆహారాన్ని కూడా ఆర్డర్ చేసుకుంటున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కొన్ని దుకాణాదారులు ఇంటికే అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జోమాటో ఫుడ్ డెలివరీతో పాటు కిరాణా సామాగ్రిని కూడా పంపిణీ చేస్తుంది. (ఫుడ్ డెలివరీబాయ్ నిజాయితీ)
Comments
Please login to add a commentAdd a comment