
ముంబై: లాక్‌డౌన్‌లో తన ప్రియురాలిని కలుసుకునేందుకు సోషల్ మీడియాలో సహాయం కోరిన ఓ నెటిజన్‌కు నటుడు సోనూ సూద్ ఇచ్చిన సమాధానం నెట్టింట నవ్వులు పూయిస్తుంది. కాగా లాక్‌డౌన్‌లో వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వేళ్లేందు ఆయన రవాణ సౌకర్యం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన సాయం కోరిన వారికి ఆయన స్పందిస్తూ సహాయక చర్యలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ వ్యక్తి బీహార్‌లో ఉన్న తన ప్రియురాలి దగ్గరి పంపించు భయ్యా అంటూ ట్విటర్ వెధికగా కోరాడు. అది చూసిన సోనూ స‍్పందిస్తూ.. ‘భయ్యా.. కొన్ని రోజులు నీ ప్రేమకు దూరంగా ఉండటానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ నిజమైన ప్రేమకు ఇది పరీక్ష’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. (సోనూసూద్.. నువ్వు రియల్ హీరో’)
ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన హాస్య చతురతకు అభిమానులు ఫిదా అవుతూ తమ స్పందనను తెలుపుతున్నారు. కాగా కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ముంబైలో చిక్కుక్ను కర్ణాటక వలస కూలీల కోసం ఆయన 10 బస్సులను నియమించి వారిని తమ ఊళ్లకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది తమకు సాయం చేయాలంటూ సోనూ సుద్‌ను ట్విటర్ ద్వారా సంప్రదిస్తున్నారు. వారి ట్వీట్‌లకు వ్యక్తిగతంగా స్పందించడమే కాకుండా వారికి సహాయక చర్యలు అందిస్తూ.. సోనూ సుద్ తన ఉదారతను చాటుకుంటున్నాడు. (నెటిజన్‌కు.. దిమ్మ తిరిగే సమాధానం)
Comments
Please login to add a commentAdd a comment