
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): డిసెంబర్ 31వ తేదీ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని పోలీసులు చేసిన హెచ్చరికలను మందుబాబులు బేఖాతరు చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు సీపీ కార్తికేయ ఆదేశాలతో పోలీసులు డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 122 మందిపై కేసులు నమోదు చేశారు. కొందరు వాహనదారులు పోలీసులను చూసి అటు నుంచి అటే వెనక్కి పారిపోగా, 122 మంది పోలీసులకు చిక్కారు. వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరు పర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment