
అబుదాబి : టీ-ఎన్నారై పాలసీ కోసం తెలంగాణ నుంచి వలస వెళ్లిన గల్ఫ్ వాసుల కోసం ‘గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక’ చేస్తున్న లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది. శనివారం యూఏఈ రాజధాని అబుదాబి, ముస్సఫా, బనియస్ చైన్ క్యాంప్స్, షార్జ్ అలిముస, రస్ అల్ ఖైమ, షార్జ్ సజ్జ తదితర ప్రాంతాల్లో సంతకాల సేకరణ జరిగింది. అశోక్ నాలం, వెంకీ(దుబాయ్), హన్మండ్లు(బహ్రయిన్), నర్సన్న(మస్కట్), శంకర్(మస్కట్), శ్రీనివాస్ రస్ అల్ ఖైమ, శరత్, సాయినాథ్‌లు సంతకాల సేకరణ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు.