గల్ఫ్ కష్టాలపై కేటీఆర్‌కు నివేదిక | report on Gulf striving to KTR | Sakshi
Sakshi News home page

గల్ఫ్ కష్టాలపై కేటీఆర్‌కు నివేదిక

Published Thu, Jul 28 2016 12:36 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

గల్ఫ్ కష్టాలపై కేటీఆర్‌కు నివేదిక - Sakshi

గల్ఫ్ కష్టాలపై కేటీఆర్‌కు నివేదిక

యూఏఈలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు పడుతున్న సమస్యలపై దుబాయ్‌లోని గల్ఫ్ సంక్షేమ సంఘ ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో నిర్వహించిన ఎన్‌ఆర్‌ఐ పాలసీ సమీక్ష సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు సుమారు 20 నిమిషాల పాటు యూఏఈలో కార్మికులు పడుతున్న సమస్యలపై మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

 

వానే తయారుచేసిన నివేదికను మంత్రికి అందజేయడంతో తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి హమీనిచ్చారు. ముఖ్యంగా నివేదిక తయారుచేసినందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌శర్మ, శ్యాముల్, సతీశ్‌రావు, విజయ్, గంగయ్య, వరంగల్‌కు చెందిన రాజాశ్రీనివాస్, నల్గొండకు చెందిన చక్రధర్‌రావులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement