తెలంగాణ ప్రవాసుల కోసం హెల్ప్ లైన్ | Help line number for Telangana nris in Malaysia | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రవాసుల కోసం హెల్ప్ లైన్

Published Fri, Jul 27 2018 8:03 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Help line number for Telangana nris in Malaysia - Sakshi

కౌలాలంపూర్ : మలేషియాలోని కౌలాలంపూర్ బ్రిక్ ఫీల్డ్స్ పామ్ కోర్ట్ హాల్‌లో మలేషియా తెలంగాణ రాష్ట్రీయ సమితి ఆధ్వర్యంలో మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మలేషియా టీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్ చిట్టిబాబు, టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బీగాల సలహా మేరకు హెల్ప్ లైన్‌ను (006010-778 1103) ప్రారంభించారు. మలేషియా ప్రవాసీ తెలంగాణ వాసులు ఎదురుకొంటున్న సమస్యలను ఈ హెల్ప్ లైన్ ద్వారా తెలియజేయాలని వైస్ ప్రెసిడెంట్ కుర్మా మారుతీ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు అధ్యక్షుడు చిట్టిబాబు చిరుత, వైస్ ప్రెసిడెంట్ మారుతీ కుర్మ, జనరల్ సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, ఇతర కోర్ కమిటీ సభ్యులు బొడ్డు తిరుపతి, గౌరు  రమేష్, బోయేని  శ్రీనివాస్, గద్దె  జీవన్ కుమార్, నడిపెళ్లి  సత్యనారాయణరావు, మునిగల అరుణ్ కుమార్,  రవీందర్ రెడ్డి తెరాస సభ్యులు రసూల్, సంతోష్, హరీష్ , కోటి, మహిళా సభ్యులు రజిత, స్వాతి, శాన్విత, స్వప్న, సౌజన్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement