Help line number
-
‘కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలపండి’.. ఇదే హెల్ప్‌లైన్ నంబర్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం కోర్టు మరో నాలుగు రోజుల ఈడీ కస్టడీ విధించింది. అయితే.. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్(8297324624)ను ప్రారంభించారు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు తమ సందేశం తెలియజేయాలనుకునే కార్యకర్తలు, అభిమానుల కోసం ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని శుక్రవారం తెలిపారు. ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ త్వరగా విడుదల కావాలని ప్రార్థనలు చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా వందల సంఖ్యలో అభిమానాలు కేజ్రీవాల్ కోసం సందేశాలు పంపుతున్నారని అన్నారు. ‘సీఎం కేజ్రీవాల్‌ను ఎంత ప్రేమిస్తున్నారో మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ సంఘీభావ సందేశం సీఎం కేజ్రీవాల్ వరకు చేరుతుంది. ఆయన వాటన్నింటిని ప్రేమతో చదువుతారు. మీరు ఆప్ పార్టీకి చెందినవారే కానవసరం లేదు. మీరంతా ఆయన త్వరగా బయటకు రావాలని ఆశీర్వదించండి’ అని సునీతా కేజ్రీవాల్ ఓ వీడియోను విడుదల చేశారు. గురువారం వరకు సీఎం కేజ్రీవాల్ ఆరురోజుల కస్టడీ ముగియగా.. రౌస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజులు పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ సమయంలో కోర్టు ప్రాంగణంలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. తనను రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేశారన్నారు. వారికి ఢిల్లీ ప్రజలే సమాధానం చెబుతారని చెప్పారు. కోర్టు కస్టడీ పొడగించిన అనంతరం.. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరోగ్యం సరిగా ఉండటం లేదు. మీ సీఎం అక్కడ వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇవ్వాలి’అని సునీతా కేజ్రీవాల్ తెలిపారు. ఇక.. మర్చి 21న అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ.. ఏప్రిల్ 1 వరకు కొనసాగనుంది. -
అమర్నాథ్ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులు.. సీఎం జగన్ ఆరా.. కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ వారిని రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో సమన్వయం చేస్తున్నారు. అకస్మాత్తుగా అమర్నాథ్లో వరదలు రావడంతో వేలాది యాత్రికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రయాణికుల భద్రతపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ రంగంలోకి దిగారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్ష్ కౌశిక్ శ్రీనర్‌కు వెళ్లారు. అమర్నాథ్లో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని హిమాన్షు కౌశిక్ తెలిపారు. శ్రీనగర్‌లోని టెంపుల్ బోర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో టచ్‌లో ఉన్నామని ఆయన తెలిపారు. చనిపోయిన వారిలో ఏపీ వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు ఏపీకి చెందిన ఆరుగురి ఆచూకీ తెలియలేదు. వినోద్ అశోక్ (విజయవాడ), గునిసెట్టి సుధ, పార్వతి (రాజమహేంద్రవరం), బి.మధు (తిరుపతి), మేడూరు జాన్సిలక్ష్మి (గుంటూరు), వానపల్లి నాగేంద్ర కుమార్‌లు (విజయనగరం) కనిపించడం లేదని గుర్తించారు. అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారి సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్లు ►ఢిల్లీ ఏపీ భవన్ హెల్ప్ లైన్ నంబర్స్: 011-23384016, 011-23387089 ►ఆంధ్ర ప్రదేశ్ హెల్ప్ లైన్ నంబర్: 1902 కాగా అమరానాథ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జల ప్రళయంలో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందగా.. ఇంకా 40 మంది యాత్రికుల ఆచూకీ తెలియరాలేదు. ఇప్పటి వరకు ఆర్మీ బేస్ క్యాంప్‌కు 15 వేల మందిని తరలించారు. అయితే అనుమతిస్తే దర్శనానికి వెళ్తామని కొందరు భక్తులు చెబుతున్నారు. -
ఎస్సీ/ఎస్టీ చట్టం అమలుకు హెల్ప్‌లైన్
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు(వేధింపుల నిరోధక) చట్టం–1989 సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడానికి ఒక హెల్ప్‌లైన్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా టోల్–ఫ్రీ నంబర్ 14566 దేశవ్యాప్తంగా నిత్యం అందుబాటులో ఉంటుందని సామాజిక న్యాయ, సాధికారత శాఖ ఆదివారం వెల్లడించింది. మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. వాయిస్ కాల్ లేదా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(వీఓఐపీ) చేయవచ్చని తెలిపింది. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు ప్రాంతీయ భాషల్లో సేవలు పొందవచ్చని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలపై వివక్షకు ముగింపు పలికి, రక్షణ కల్పించేలా చట్టంపై అవగాహన కల్పించడమే హెల్ప్‌లైన్ ఉద్దేశమని వివరించింది. ప్రతి ఫిర్యాదును ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేస్తామని, బాధితులకు సాయం అందిస్తామని తెలియజేసింది. -
ఎలాంటి ఆపద ఉన్నా కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తుండడం, పలు ప్రాంతాలను వరదలు పోటెత్తుతున్న నేపథ్యంలో ఎవరికైనా ఎలాంటి కష్టం ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 040–23450624కు కాల్ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమైతే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. జిల్లాల్లో రైల్వే లైన్లకు దగ్గరగా ఉన్న చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎస్ సూచించారు. -
కరోనా లక్షణాలు ఉంటే కాల్ చేయండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అను మానిత లక్షణాలు కలిగిన వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ చెప్పా రు. దగ్గు, జ్వరం, జలుబు, పదార్థాల రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కలిగిన వారంతా 9963112781 నంబ రుకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ♦ అనంతరం ఎస్ ఎం ఎస్ ద్వారా కన్ఫర్మేషన్ మెసేజ్ కస్టమర్‌కు అందుతుందన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలనుకునేవారు వెబ్ లింక్ http://covidandhrapradesh. veeraheathcare.comద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. ♦ వైద్యపరీక్షలు నిర్వహించేందుకు 10 మొబైల్ ఐ మాస్క్ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచి జిల్లాలోని 10 ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రతి బస్సులో 10 ప్రత్యేక కౌంటర్లు ఉంటా యని చెప్పారు. విజయవాడ నగరంలో కృష్ణలంక, గాంధీ స్కూల్, ఇందిరాగాంధీ స్టేడియం, బసవపున్నయ్య స్టేడియం, గుణదల మేరీమాత టెంపుల్, రైల్వే స్టేషన్ వద్ద, జిల్లాలోని మచిలీపట్నం, నూజివీడు, జగ్గయ్యపేట, ఇబ్రహీం పట్నంలో ఐ మాస్క్ బస్సులను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సమా వేశంలో జేసీ (రెవెన్యూ) కె మాధవీలత, డా. రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 64,110 మందికి కరోనా పరీక్షలు ♦ జిల్లాలో ఇప్పటివరకు 64,110 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. వీటిలో మొత్తం 1115 కేసులు నమోదు కాగా వారిలో 684 మంది డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 455 మాత్రమే ఉన్నాయన్నారు. ♦ 61.35 శాతం మంది ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. 5 క్వారంటైన్ సెంటర్లలో 317 మంది ఉన్నారన్నారు. వీరందరికీ అవసమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. -
విశాఖ ఘటన: హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఎల్జీ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. ఘటనపై ఎలాంటి సమాచారం కోసమైనా డిప్యూటీ డైరెక్టర్ ఎస్ ప్రసాదరావును సంప్రదించాలని తెలిపారు. ఇందుకు హెల్ప్‌లైన్ నెంబర్లు 7997952301... 8919239341 అందించారు. అలాగే మరో అధికారి ఆర్ బ్రహ్మ అందుబాటులో ఉన్నారని (9701197069) ఆయన్ను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పరిశ్రమకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను తరలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు భయపడవద్దని, అధికారులకు సహాకరించాలని మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. (విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం) Vizag Gas Leak #Helpline Please refer to our help desk numbers. pic.twitter.com/6maDvKy3wQ — Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) May 7, 2020 విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటపురంలో గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకజీ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. దాదాపు 200 వందల మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సంభవించడంతో ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు దాదాపు 3 కిలోమీటర్ల మేర వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ఖాళీ చేశారు. అయితే గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. (గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన సీఎం జగన్) విశాఖ గ్యాస్ లీకేజీపై ఎల్జీ కెమ్ స్పందన -
కరోనా ప్రకంపనలు: హెల్ప్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే విమానాశ్రయాల వద్ద కఠినమైన స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన 11మంది వైరస్ బారిన పడ్డారన్న అనుమానాలతో పరిశీలనలో ఉన్న నేపథ్యంలో జ్వరం, దగ్గు ,తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తమను సంప్రదించాలని కోరింది. ఇందుకు 24x7 హెల్ప్‌లైన్ + 91-11-23978046ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చైనాలో ఉన్న లేదా అక్కడి నుండి భారతదేశానికి తిరిగి వచ్చే ప్రయాణికులను కొన్ని "డాస్ అండ్ డోంట్స్" (చేయవలసిన, చేయకూడని పనులు) జాబితాను అనుసరించమని మంత్రిత్వ శాఖ కోరింది. ఈ ఏడాది జనవరి 1 నుండి చైనానుంచి తిరిగి వ్యక్తులు స్వచ్ఛందంగా అధికారులకు నివేదించాలని సీనియర్ అధికారి ఒకరు కోరారు. కేరళ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన వారు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలోనే హెల్ప్‌లైన్‌ను ఏర్పటు చేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని కోరింది. అలాగే చైనాలో ఉన్నవారు అనారోగ్యంతో బాధపడుతుంటే చైనాలోని భారత రాయబార కార్యాలయానికి నివేదించాలని పేర్కొంది. దీంతోపాటు భారతదేశానికి తిరిగి వచ్చేటప్పుడు విమానంలో ప్రయాణికులు అనారోగ్యంతో బాధపడుతుంటే, వెంటనే విమానయాన సిబ్బందికి తెలియజేయాలనీ,తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, కుటుంబ సభ్యులు లేదా ఇతర ప్రయాణికులతో సన్నిహితంగా ఉండరాదని సూచించింది. మరోవైపు చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాబినెట్ కార్యదర్శి, హోం వ్యవహారాల కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శి, రక్షణ, కార్యదర్శి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కార్యదర్శి, పౌర విమానయాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో, కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించిన ఇటీవలి పరిణామాలు, సంసిద్ధత, ప్రతిస్పందన చర్యలపై అధికారులు ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఆసుపత్రి సంసిద్ధత, ప్రయోగశాలల సంసిద్ధత, రాపిడ్ రెస్పాన్స్ బృందాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి తీసుకున్న చర్యలతోపాటు మంత్రిత్వ శాఖ చేపట్టిన విస్తృతమైన కార్యకలాపాలపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శికి వివరించారు. అలాగే పౌర విమానయాన, ఇతర మంత్రిత్వ శాఖలు తీసుకున్న నివారణ చర్యలను కూడా ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయంతో ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు ప్రధాన కార్యదర్శికి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్స్‌ను సిద్ధం చేశామనీ, అన్ని రాష్ట్ర, జిల్లా ఆరోగ్య అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే చైనాలో 41 మందని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి మరో 1,300 మందికి పైగా సోకింది. అనేక ఇతర దేశాలకు వ్యాప్తి చెందడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం హాంకాంగ్‌లో 5, మకావోలో ఇద్దరు, తైవాన్‌లో ముగ్గురు, థాయ్‌లాండ్‌లో 4, జపాన్‌లో 2, దక్షిణ కొరియాలో 2, అమెరికాలో 2 వియత్నాంలో3 , సింగపూర్‌లో 3, నేపాల్ -1, ఫ్రాన్స్‌లో ఒకరు ఈ వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. చదవండి : ‘కరోనా’ బారిన తొలి భారతీయురాలు కరోనా ఎయిరిండియా, ఇండిగో కీలక నిర్ణయం, Principal Secretary to the Prime Minister chairs a high level meeting on Coronavirus outbreak https://t.co/pngZKgI055 — PMO India (@PMOIndia) January 25, 2020 -
తెలంగాణ ప్రవాసుల కోసం హెల్ప్ లైన్
కౌలాలంపూర్ : మలేషియాలోని కౌలాలంపూర్ బ్రిక్ ఫీల్డ్స్ పామ్ కోర్ట్ హాల్లో మలేషియా తెలంగాణ రాష్ట్రీయ సమితి ఆధ్వర్యంలో మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మలేషియా టీఆర్ఎస్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బీగాల సలహా మేరకు హెల్ప్ లైన్‌ను (006010-778 1103) ప్రారంభించారు. మలేషియా ప్రవాసీ తెలంగాణ వాసులు ఎదురుకొంటున్న సమస్యలను ఈ హెల్ప్ లైన్ ద్వారా తెలియజేయాలని వైస్ ప్రెసిడెంట్ కుర్మా మారుతీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు అధ్యక్షుడు చిట్టిబాబు చిరుత, వైస్ ప్రెసిడెంట్ మారుతీ కుర్మ, జనరల్ సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, ఇతర కోర్ కమిటీ సభ్యులు బొడ్డు తిరుపతి, గౌరు రమేష్, బోయేని శ్రీనివాస్, గద్దె జీవన్ కుమార్, నడిపెళ్లి సత్యనారాయణరావు, మునిగల అరుణ్ కుమార్, రవీందర్ రెడ్డి తెరాస సభ్యులు రసూల్, సంతోష్, హరీష్ , కోటి, మహిళా సభ్యులు రజిత, స్వాతి, శాన్విత, స్వప్న, సౌజన్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆత్మహత్యల నివారణకు హెల్ప్‌లైన్
హిమాయత్‌నగర్ : ఆత్మహత్య చేసుకునేవారి బాధను విని, ఆ ఆత్మహత్య బారి నుంచి వారిని కాపాడి బంగారు భవిష్యత్‌ను అందించేదుకు హెల్ప్ లైన్ కోసం 7207308383 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చేతన హాస్పిటల్ సెక్రియాటిస్ట్ డాక్టర్ పి.కె.ఎన్.చౌదరి తెలిపారు. శనివారం చేతన హాస్పిల్ ఆధ్వర్యంలో 'స్పాన్' (సూసైడ్ ప్రెవెన్షన్ యాక్షన్ నెట్వర్క్) అనే పేరుతో ఓ హెల్ప్ లైన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చౌదరి మాట్లాడుతూ.. తీవ్ర ఒత్తిడిలకు గురై ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు ఒక్కసారి ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే వారి బాధను అంతా టీమ్ సభ్యులు వింటారన్నారు. ఆత్మహత్య చేసుకోదలచిన వ్యక్తి బాధను వింటే కొంతవరకు అతను ఉపశమనం పొంది ఆత్మహత్యపై మక్కువ పోతుందన్నారు. తద్వారా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు. ఈ స్పాన్ అనే సంస్థ ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. ఎక్కడివారైనా ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే సంబంధిత ఏరియా ప్రతినిధులకు కనెక్ట్ చేసి వారి సమస్య పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.