
సాక్షి, విశాఖపట్నం : మూడు రోజుల సౌహార్ద్ర పర్యటనలో భాగంగా భారతీయ నావికాదళ యుద్ధ నౌకలు సహ్యాద్రి, శక్తి, కమోర్త ఆదివారం సింగపూర్ పోర్టుకు చేరుకున్నాయి. మూడు రోజుల పర్యటనలో విద్యార్థులు, సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయ సంతతకి యుద్ధ నౌకలను సందర్శించే అవకాశం కల్పిస్తారు. రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ (ఆర్‌ఎస్‌ఎన్) ఫ్లీట్ కమాండర్ కల్నల్ ఎడ్విన్ లియాంగ్ నేతృత్వంలో కమాండింగ్ అధికారులు, యుద్ధ విమాన నిర్వహణ అధికారులు సోమవారం సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య వివిధ అంశాలకు సంబంధించిన దౌపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య బలమైన స్నేహబంధాన్ని పెంచుతుంది.
Comments
Please login to add a commentAdd a comment