500 కార్మిక కుటుంబాలకు నాట్స్ సాయం | Nats helps 500 families in Ananthapur | Sakshi
Sakshi News home page

500 కార్మిక కుటుంబాలకు నాట్స్ సాయం

Published Fri, Jun 5 2020 12:32 PM | Last Updated on Fri, Jun 5 2020 12:34 PM

Nats helps 500 families in Ananthapur - Sakshi

అనంతపురం: లాక్‌డౌన్‌తో పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు సహాయం చేసింది. అనంతపురంలో కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయిన కూలీలకు నాట్స్ సాయం చేసింది. నగరంలోని కంకర క్వారీలో కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయం నాట్స్ ఉపాధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి(బాపు) దృష్టికి స్థానికులు తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. వారికి నిత్యావసరాలు, కూరగాయలకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని చేశారు. దీంతో స్థానిక నాయకులు నాట్స్ సంస్థ ఆధ్వర్యంలో 500 కార్మిక కటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్‌తో పనులు లేక ఉపాధి కోల్పోయిన కార్మికుల ఇబ్బందులు తెలుసుకుని వారికి సాయం అందించడానికి ముందుకు వచ్చిన నాట్స్ సంస్థకు, నాట్స్ ఉపాధ్యక్షులు బాపయ్య చౌదరి నూతికి స్థానిక నేతలు మణి, సరస్వతి, శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. తెలుగునాట నిరుపేదలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా ఆ విషయం తమ దృష్టికి వస్తే తగిన సాయం చేస్తున్నామని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి ఈ సందర్భంగా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement