
న్యూజెర్సీ: మహానేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర దేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినదని న్యూజెర్సీలోని వైఎస్సార్సీపీ అభిమానులు పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి
చరిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని ఎన్‌ఆర్‌ఐలు గుర్తుచేసుకున్నారు. మళ్లీ రాజన్న పాలన రావాలంటే ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. వైఎస్
రాజశేఖరరెడ్డి అందించిన సుపరిపాలనను గుర్తు చేసుకుంటూ వైఎస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.