
దుబాయ్ : ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జననేత జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా దుబాయ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ యూఏఈ ఆధ్వర్యంలో ‘వాక్ విత్ జగనన్న’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబాయ్‌లో నిసిస్తున్న ప్రవాసాంధ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జగనమోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాల కన్నా నవరత్నాలు బాగున్నాయని, తప్పకుండా జగన్‌మోహన్ రెడ్డి సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్ రెడ్డి, ప్రసన్న సోమిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రమణ, కార్తీక్, దిలీప్, నరసింహారెడ్డి, కోటిరెడ్డి, విజయభాస్కర్, ప్రభాకర్, విశ్వనాథ్ అమర్‌నాథ్, రామకృష్ణ, నర్సారెడ్డిలు పాల్గొన్నారు.





