బంగారు తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత తహసిల్దార్‌లపైనే ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించడం వాస్తవం.
బంగారు తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత తహసిల్దార్‌లపైనే ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించడం వాస్తవం. ప్రజల కోసం పనిచేసే అధికార్లలో తహసిల్దార్‌లదే ప్రథమస్థానం. ఎందుకంటే ప్రభు త్వ పథకాలు ఠంచనుగా ప్రజల చేతికి అందాలంటే తహసిల్దార్ల పాత్ర ను ఎవరూ తక్కువ చేయకూడదు. 2012లో ఒక తహసి ల్దారిణి సింగరేణి ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నా యని తెలిసి వంద రేషన్ కార్డులను ఏరివేశారు. తన కార్యాలయాన్ని అవినీతికి ఆమడదూరంలో ఉంచారు.
2013 జనవరిలో ఈమె తాండూరు తహసిల్దారుగా నిత్యావసర వస్తువుల అక్రమ సరఫరాను అడ్డుకుని 200 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనపర్చుకుని భారత ఆహార కార్పొరేషన్ -ఎఫ్‌సీఐ-కి పంపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిజాయితీపరులైన అధి కారుల సేవలను, అంకితభావాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే ఆహార భద్రత పథకం నిజమైన అర్హులకు మాత్రమే అంది పేదల కడుపు నిండుతుం ది. వీలైతే ఉత్తరప్రదేశ్‌లో గుత్తేదార్ల అవినీతిని అడ్డుకుని విశేష ప్రచారం పొందిన ఈ గడ్డకు చెందిన ఉన్నతాధికారిణి చంద్రకళను డిప్యుటేషన్‌పై తెలంగాణకు రప్పించాలి. నిజాయితీ ఉన్న అధికారులను కాపాడుకు నేలా, ప్రోత్సహించేలా కేసీఆర్ తగు చర్యలు చేపట్టాలని విన్నపం.