బ్యాంకులకు చిట్కా వైద్యమా? | banks chitka of 1990s methods | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు చిట్కా వైద్యమా?

Published Tue, Aug 25 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

బ్యాంకులకు చిట్కా వైద్యమా?

బ్యాంకులకు చిట్కా వైద్యమా?

సందర్భం
జనసామాన్యానికి అండగా బ్యాంకులు ఉండాలనే లక్ష్యంతో నాడు వాటి జాతీయీకరణ జరిగింది. కానీ 1990 లలో ప్రబలిన నయా ఉదారవాద ప్రపంచీకరణ నేపథ్యంలో జాతీయ బ్యాంకులు, ఈ లక్ష్యాన్ని పూర్తిగా మరిచిపోయాయి.
 
అమెరికా కేంద్రంగా 2008 సెప్టెంబర్‌లో ప్రపంచ ఫైనా న్స్, ఆర్థిక సంక్షోభాలు మొద లయ్యాయి. కానీ, నాడు ఈ సంక్షోభ ప్రభావం భారత దేశ ఆర్థిక వ్యవస్థను పెద్దగా తాక లేదు. ఈ కారణం చేతనే 2009వ సంవత్సరంలో నాటి మన కేంద్ర ఆర్థిక మంత్రి, వార్షిక బడ్జెట్‌ను సమర్పిస్తూ - దేశ ఆర్థిక వ్యవస్థ అంత ర్గత బలానికి కారణాలలో మన జాతీయం చేయబడిన బ్యాంకుల పాత్రను ప్రధానంగా పేర్కొన్నారు. కాగా, ఇది నిన్నటి మాట!


నేడు, మన దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకులు తీవ్ర ఒత్తిడి కింద ఉన్నాయి. ఈ బ్యాంకులలో-మొండి బకా యిలు భారీగా పెరిగిపోయి 2013-14 నాటికి 2.16 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీనితో, ఈ బ్యాంకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మన దేశంలో కూడా అమెరికా తరహాలో సబ్-ప్రైమ్ సంక్షో భం ఏర్పడుతుందా? అనే భయాందోళనలు పెరిగిపోసా గాయి. ప్రభుత్వం పూనుకొని ఈ బ్యాంకులకు మూల ధన మొత్తాన్ని సమకూర్చవలసిన అగత్యం ముందు కొచ్చింది. ఈ నేపథ్యంలోనే 2019 ఆర్థిక సంవత్సరం వరకూ - అంటే 2015-16 నుంచీ 4 సంవత్సరాల కాలంలో ఈ బ్యాంకులకు 70 వేల కోట్ల రూపాయల మేర మూలధనాన్ని అందించాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీనిలో భాగంగానే, రానున్న నెల రోజుల కాలంలో (ఆగస్టు 15 నుంచీ మొదలుకొని) 13 జాతీయ బ్యాంకులకు, 20 వేల 88 కోట్ల రూపాయలను అందించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ జరిగిన కథ ఇది. కానీ, అసలీ బ్యాంకులు 2008-09 నాటి పటి ష్టస్థితి నుంచి ఎందుకు ప్రస్తుత ఇబ్బందులలో పడిపో యాయి? ఈ మౌలిక లోపాలను సరిదిద్దుకునే దిశగా ప్రభుత్వం లేదా బ్యాంకులు ఎంత మేర కృషి చేస్తున్నా యి? అనేవి ఇక్కడి ప్రశ్నలు.


బ్యాంకుల మొండి బకాయిలలో సింహభాగం మన దేశ కార్పొరేట్ రంగానిదే అన్నది ఇక్కడ గమనా ర్హం. కాగా, నేటి మన ఈ పరిస్థితికి గత 3-4 ఏళ్లుగా మన దేశ ఆర్థిక పరిస్థితిలో కూడా ఏర్పడిన మందగింపు కొంత మేరకు కారణంగానే ఉంది. దేశీయ బ్యాంకుల వడ్డీరేట్లు బాగా పెరిగిపోవడం, ఆర్థిక మందగింపు వల న రుణాల చెల్లింపు కార్పొరేట్లకు పెనుభారంగా మారిం దన్నది కూడా సత్యమే! కానీ, ఈ స్థితికి దీనికి మించిన ఇతరేతర మౌలిక కారణాలు కూడా ఉన్నాయి. 2008 అనంతరం పలు దఫాలు, మన దేశం ‘అగ్రరాజ్యం’ కాబోతుందనే, నేల విడిచి సాము చేసే ఆశలను మన పాలకులు పెంచి పోషించారు. ప్రపంచ ధనిక దేశాలలో ఏర్పడిన ఫైనాన్స్ సంక్షోభం నేపథ్యంలో, మన దేశం అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులూ, సట్టా వ్యాపారా నికి (రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల వంటివి) కేంద్రం కావడం ద్వారా, మనం ఈ ‘అగ్రరాజ్య’ స్థాయిని చేరు తామనేది దీని వెనుకన ఉన్న తర్కం. దీనికి తోడుగా 2004-08 కాలంలో రియల్ ఎస్టేట్ వంటి సట్టా వ్యాపా రాలు కేంద్ర బిందువుగా మన దేశం భారీ వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే మన ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా ముందూ వెనుకా చూసుకోకుండా రుణ వితరణ జరిపాయి.


నిజానికి, 1969లో మన బ్యాంకుల జాతీయీకరణ జరగడం వెనుకన ఉన్న ప్రాథమిక లక్ష్యాలకు విరుద్ధంగా నేటి మన ప్రభుత్వరంగ బ్యాంకుల తీరు ఉంది. దేశం లోని జనసామాన్యానికి అండగా, వెన్నుదన్నుగా బ్యాం కులు ఉండాలనే లక్ష్యంతో నాడు వాటి జాతీయీకరణ జరిగింది. కానీ కాలక్రమంలో, మరీ ముఖ్యంగా 1990 లలో దేశంలో నయా ఉదారవాద ప్రపంచీకరణ క్రమం నేపథ్యంలో జాతీయ బ్యాంకులు, ఈ లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోయాయి. వాటి పని తీరు కార్పొరేట్ సంస్థలూ, ధనికులకూ అనుకూలమైన దిశలోకి మళ్లింది. కానీ, స్వయాన మన కేంద్ర ఆర్థిక మంత్రులు కూడా తమ ప్రసంగాలలో అడపాదడపా - బ్యాంకుల నుంచి తాము తీసుకున్న రుణాలను చెల్లించటంలో, సామాన్యులే (ధని కులు, కార్పొరేట్ల కంటే!) ఎక్కువ నిజాయితీగా ఉన్నా రని చెప్పడం ఇక్కడ గమనార్హం.


దీనంతటితో పాటుగా తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశీ య వ్యవసాయ రంగంలో కంటే కూడా, చాలా పెద్ద స్థాయిలో కార్పొరేట్ రంగంలోనే ఈ
మొండి బకాయి లూ ఉన్నాయనేది కఠిన వాస్తవం. అంతకుమించి, నేడు మన జాతీయ బ్యాంకులు తమ రుణ వితరణలో వ్యవ సాయ రంగం పట్ల చిన్నచూపు చూపడం వలన కూడా మన వ్యవసాయదారులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు అనేకం!

కాబట్టి, మన ప్రభుత్వరంగ బ్యాంకులు తమ తీరు తెన్నులను, విధానాలనూ సరైన దిశగా సవరించు కోకుండా ప్రభుత్వాలు వాటిని ఎంతగా ఆదుకున్నా ఫలి తం పెద్దగా ఉండదు. మన దేశ పాలకులు 1990ల నుం చీ తలకెత్తుకున్న ఉదారవాద ప్రపంచీకరణ విధానాలే ఈ పరిస్థితి అంతటికీ మూలకారణంగా ఉన్నాయి. ధనవంతులూ, కార్పొరేట్ల సేవలో తరించేందుకు గాను ‘మరో ప్రత్యామ్నాయం లేదు’ అనే పేరిట - బ్రిటన్‌లో మార్గరెట్ థాచర్, అమెరికాలో రోనాల్డ్ రీగన్‌ల కాలంలో తెరపైకి వచ్చిన - ఈ విధానాలే అమెరికాలోని నిన్నటి ఆర్థిక సంస్థల, బ్యాంకుల పతనానికీ, నేటి మన దేశీయ బ్యాంకుల సమస్యలకూ, స్థూలంగా నేటి ప్రపంచంలోని ఆర్థిక మాంద్య స్థితికీ అసలైన కారణం! ఈ విధానాలను మార్చుకోకుండా, వాటి కారణంగా నష్టాల బాటను పట్టిన మన బ్యాంకులను ‘ఆదుకునేందుకు’ ప్రభుత్వా లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, వాస్తవ స్థితిలో మాత్రం మార్పు ఉండదు!!!







 డి. పాపారావు
 వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు
 మొబైల్: 9866179615.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement