రంగుల కల!
ఓ పంట వరి సిరులతో పసిడిదనాన్ని పరిచింది..
మరో పంట మొక్కజొన్నగా పచ్చదనాన్ని పంచింది..
తెల్లటి బంగారమై నిలువెత్తు ఆశలు నింపిందొకటి..
నీడనిచ్చే వృక్షంగా నింగి నుంచి ఆశల పూలు కురిపించింది మరొకటి..
శీతల గాలుల చక్కిలిగింతలకు పురివిప్పిన నెమలి వలె విప్పారిన అందమైన ఈ పంట పొలాలు భవిష్యత్తులో కలగా మిగలనున్నాయా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరు మండలంలోని దొండపాడులో కనిపించిన ఈ పొలాల మధ్య రానున్న రోజుల్లో కాలుష్యాన్ని చిమ్మే ఎలాంటి పరిశ్రమలు వస్తాయోనని పర్యావరణ ప్రేమికులు భయపడుతున్నారు.
- ఫొటో : రూబెన్ బెసాలియేల్, గుంటూరు