సమాచార సోమరితనం..!
విశ్లేషణ
ఆక్రమణ వల్ల నష్టపోయినవారి కంటే, ఆక్రమణదారుడి అవినీతి బలం చాలా గొప్పది. ప్రభుత్వ కార్యాలయాల్లో జాడ్యం, నిర్లిప్తత, నిష్క్రియ సహజంగా ఉండే సోమరితనం వల్ల వచ్చేవని చాలామంది అంటూ ఉంటారు.
పనికిరాని సమాచారం కుప్పలు తెప్పలుగా అడు గుతూ వేధించే వారు ఆర్టీఐని ఎంత దుర్వినియోగం చేస్తు న్నారో, అవసరమైన సమా చారం ఇవ్వకుండా నిష్కార ణంగా ఏడిపించే కొందరు వ్యక్తులు అంతే దారుణంగా ఆర్టీఐని దెబ్బతీస్తున్నారు. సహకార సంఘాల రిజిస్ట్రార్ కార్యాలయం (ఆర్‌సీఎస్) ఢిల్లీలో సహకార సంఘాలను ఇలాగే ఏడిపిస్తున్నారు. రాశి సహకార గృహనిర్మాణ సంఘం కార్యదర్శి బహల్, తమలో సభ్యుడు కాని వ్యక్తి ఒక ఫ్లాట్‌ను ఆక్రమించుకున్నాడని రిజిస్ట్రార్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. వారు సాధారణంగా కదలరు. 65 సంవత్సరాల వయసును కూడా లెక్కచేయకుండా బహల్ వెంటపడితే ఇక వారికి తప్పలేదు. అధికారికంగా ఆర్బిట్రేషన్ శాస్త్ర ప్రకారం జరిపించి, ఆక్రమణదారు ఆరు లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ధారించారు. ఢిల్లీ నగరంలో ఒక ఫ్లాట్‌ను ఆక్రమించుకున్నందుకు మంచి లాభమే. ఆరు లక్షలు చెల్లిస్తే చాలట. కనీసం ఆరు లక్షలైనా వసూలు చేస్తే గొప్పే అని సంతోషించారు.
కానీ ఆక్రమణదారుడి అవినీతి బలం చాలా గొప్పది. ప్రభుత్వ కార్యాలయాల్లో జాడ్యం, నిర్లిప్తత, నిష్క్రియ సహజంగా ఉండే సోమరితనం వల్ల వచ్చేవని చాలామంది అంటూ ఉంటారు. ఆర్బిట్రేషన్ అవార్డు అమలు చేయడానికి సర్కారీ కార్యాలయానికి బద్ధకం, అదీ తెచ్చిపెట్టుకున్న బద్ధ్దకం. లేదా అమలు చేయక పోవడం వల్ల మేలు పొందే వ్యక్తి కొనుక్కున్న బద్ధకం అయినా అయి ఉంటుంది. ఎన్ని నెలలయినా ఆర్బి ట్రేషన్ నిర్ణయాన్ని అమలు చేయక పోవడంతో విసిగి పోయిన బహల్ ఆర్టీఐని ఆశ్రయించారు. పనిచేయని వారి చేత లంచం ఇవ్వకుండానే పనిచేయించాలి అనే పట్టుదల బహల్‌ైదైతే, ఏ చట్టమైనా సరే మా దగ్గర ఉన్న ఆయుధం ముందు ఏ రకంగానూ పనిచేయదనే ధైర్యం అవినీతిపరులది.
బహల్ పోరాటం ఆర్టీఐలో కూడా సాగింది. ఆర్‌సిఎస్ కార్యాలయంలో ఎవరూ జవాబివ్వరు. ఏమీ చెప్పరు. మొదటి అప్పీలు గతి కూడా అంతే. అక్కడి అధికారి కొంత న్యాయం చేసి సమాచారం ఇవ్వండి అని ఆదేశించినా సరే పాటించరు. సమాచారం ఇవ్వరు. ఎందుకంటే సమాచారం ఇవ్వడానికి ఆర్బిట్రేషన్ అవా ర్డును అమలు చేయవలసి ఉంటుంది. వీైలైనంత వాయిదా వేయడమే మన సర్కారీ కార్యాలయాల క్రియాశీలత. రెండో అప్పీలులో సమాచార కమిషన్‌ను బహల్ న్యాయం అడిగారు.
పెండింగ్ అప్పీళ్ల సంఖ్య వల్ల అక్కడా ఆలస్యం తప్పలేదు. 2014లో సమాచారం వేట మొదలు పెట్టినా రెండో అప్పీలు తుది విచారణకు వచ్చేసరికి 2016 జనవరి వచ్చేసింది. జూన్ 16, 2015న షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఆరు లక్షల వసూలు ఎంతవరకు వచ్చిందో 15 రోజుల్లో సమాధానం ఇవ్వండి అని ఆదేశించారు. బహల్ రెండు మూడు నెలలు ఎదురుచూసినా, సమా ధానమూ లేదు. అసలు పట్టించుకున్నవాడు లేడు. సుప్రీంకోర్టు తీర్పులే మమ్మల్ని కదిలించలేవు. సీఐసీ ఆదేశాలు ఒక లెక్కా? లంచాల అసుర శక్తిముందు కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయదేవత ఎవరిని చూస్తుంది, ఏంచేస్తుంది?
పాపం బహల్.. మళ్లీ మీ ఆదేశం పాటించలేదు జరిమానా విధించండి అంటూ సీఐసీ వచ్చారు. ఆదేశం అమలు చేయలేదెందుకు? అని మళ్లీ షోకాజ్ నోటీసు జారీ చేసిన తరువాత కూడా దిక్కులేదు. ఆ కార్యా లయం సీపీఐఓ అప్పుడప్పుడూ వచ్చారు. సమయం ఇవ్వండి సమాచారం ఇస్తాం అని ఒప్పుకున్నారు. తరువాతి తేదీన తప్పుకున్నారు. వివరణ ఇవ్వవలసిన తుది తేదీన రాలేదు. మళ్లీ 3 వారాల సమయం ఇచ్చినా, మీరు రాకపోయినా జరిమానాతోపాటు విచారణ జరు గుతుందని కఠినంగా హెచ్చరించినా ఫలితం లేదు.
మొదటినుంచీ ఆర్టీఐ అభ్యర్థనకు స్పందన లేనం దుకు జరిమానా విధించవచ్చు. చివరకు సీఐసీ ఆదేశం పాటించనందుకూ జరిమానా విధించవచ్చు. కనీసం రెండు నేరాలు ఇందులో ఉన్నాయి. రెండుసార్లు 25 వేల రూపాయల జరిమానా విధించాలా? ఒక్క బడుగు ఉద్యోగి ిసీపీఐఓ అయినంత మాత్రాన ఒకే కేసులో 50 వేల రూపాయల జరిమానా జేబులోంచి చెల్లించగలరా అని కమిషన్‌కు, బహల్‌కి సానుభూతి కలగవలసిందే గాని, సీపీఐఓలో ఆ ఆలోచనే లేదు. రాదు.
తన ఉత్తర్వును తానే అమలు చేసే అధికారం కమిషన్‌కు చట్టం ఇచ్చిందా లేదా అనే ప్రశ్నకు కర్ణాటక హైకోర్టు 2009లో జి. బసవరాజు వర్సెస్ అరుంధతి (సిసిసి నెంబర్ 525-2008 సివిల్ కేసులో) సరైన సమాధానం ఇచ్చింది. ఆర్టీఐ చట్టం అన్ని అధికారాలు కలిగి ఉన్న సమగ్రమైన చట్టం, అందులో సమాచార న్యాయస్థానాలు (కమిషన్లు) తమ ఉత్తర్వులను అమలు చేయించుకునే శక్తిని కలిగి ఉన్నాయి.
సెక్షన్ 20 కింద ఆ అధికారం ఉంది అని తీర్పు చెప్పారు. సమాచార కమిషనర్లు బలహీనులనే వారికి ఈ తీర్పు సమాధానం. సొసైటీ అధికారికి, కొత్త సీపీఐఓకి నోటీసులు జారీ చేసినా ఫలితం లేదు. ఏడాదిన్నర పాటు తనను వేధించారని, పరిహారం ఇప్పించాలని కూడా బహల్ కోరారు. సమాచార అధికారిపైన 25 వేల రూపాయల జరిమానా విధించడంతోపాటు బహల్‌కి 10 వేల రూపా యల నష్టపరిహారం చెల్లించాలని ఆర్‌సీఎస్‌ను సీఐసీ ఆదేశించింది. (ఆర్.ఎల్. బహల్ వర్సెస్ ఆర్‌సీఎస్ కేసులో 1.2.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా).
మాడభూషి శ్రీధర్,
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com