ఒక సంవత్సరంలో ఎంత చదవ్వొచ్చు?... | could we read all books in period of one year ? | Sakshi
Sakshi News home page

ఒక సంవత్సరంలో ఎంత చదవ్వొచ్చు?...

Published Sat, Feb 1 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

ఒక సంవత్సరంలో ఎంత చదవ్వొచ్చు?...

ఒక సంవత్సరంలో ఎంత చదవ్వొచ్చు?...

ఒక మనిషి ఒక సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు చదవ్వొచ్చు? టైమ్ లేదు, దొరకలేదు, కుదరలేదు వంటి సాకులు వెతుక్కోవడం మానేస్తే పుస్తకం వెంట నిజంగా పడదలిస్తే ఇదిగో నిజంగానే జంపాల చౌదరి చదివినన్ని పుస్తకాలు చదవ్వొచ్చు. ‘ఈ సంవత్సరం నా పుస్తకాల చదువు కొంచెం ఒడిదుడుకులతోనే సాగింది’ అని బాధపడ్తూ తాను 2013లో చదివిన పుస్తకాలను ఆయన పుస్తకండాట్‌నెట్‌లో పెట్టారు. బాప్ రే. ఎంత అదృష్టం ఇది. ఇన్ని పుస్తకాలు చదవడం. సైకియాట్రిస్ట్‌గా పెద్ద బాధ్యతలు ఒకవైపు, తానాలో కీలక బాధ్యతలు మరోవైపు ఉన్నా, తెలుగు పుస్తకాలన్నీ కోరిన వెంటనే బజారుకు వెళ్లి కొనుక్కునే వీలు లేని అమెరికాలో ఉంటున్నా ఆయన ఈ పుస్తకాలన్నీ చదివారు. చాలా ఏళ్ల తర్వాత శతాబ్ది సూరీడు నవల చదవడం సంతోషాన్ని ఇచ్చిందని కూడా చెప్పుకున్నారు. ఏడాదిలో ఒకరు చదవదగ్గ పుస్తకాల సంఖ్య కోసమే కాదు... మంచి పుస్తకాల పట్టిక తెలియడానికి కూడా ఆయన చదివిన పుస్తకాలను  దాదాపుగా ఇక్కడ ఇస్తున్నాం.
 
కథా సంకలనాలు: కథ 2012, కథావార్షిక 2012, పాత్రినిధ్య 2012, నవ కథామాల, కొత్తగూడెం పోరగాడికో  లవ్ లెటర్ (సామాన్య), ఇంతిహాసం (మృణాళిని), యానాం కథలు (దాట్ల దేవదానం రాజు), లోలోపల (వి. రాజారామమోహనరావు) కాటుక కళ్లు (శ్రీపతి), తెల్లకొక్కెర్ల తెప్పం (డా.ఎన్.వసంత్), ఎర్నూగుపూలు (కృష్ణ రసం), పి.చంద్రశేఖర్ ఆజాద్ కథలు, తోలేటి కథలు, పి.సత్యవతి కథలు, విముక్త (ఓల్గా), ఊరు వీడ్కోలు చెప్పింది (శీలా వీర్రాజు), కొండఫలం (వాడ్రేవు వీరలక్ష్మీదేవి), అంబల్ల జనార్దన్ కథలు, విదేశీ కోడలు (కోసూరి ఉమా భారతి), మనసుకో దాహం (కుప్పిలి పద్మ), సంయుక్త రచనలు (చింతం రాణీ సంయుక్త), వానజల్లు (ఇచ్చాపురపు జగన్నాధరావు) నవలలు: నికషం (కాశీభట్ల), జిగిరి (పెద్దింటి అశోక్‌కుమార్).

ఈ దేశంలో ఒక భాగమిది (కొమ్మూరి వేణు  గోపాలరావు), పెంకుటిల్లు (కొమ్మూరి వేణుగోపాలరావు), ఖాకీవనం (పతంజలి), శతాబ్ది సూరీడు (మాలతీ చందూర్), ఆకుపచ్చని దేశం (డా.వి.చంద్రశేఖరరావు), నల్లమిరియం చెట్టు (డా.వి.చంద్రశేఖరరావు), విడీవిడని చిక్కులు (వీరాజీ), అధోజగత్ సహోదరి (అక్కినేని కుటుంబరావు), రామ్‌ఎట్‌శృతిడాట్‌కామ్ (అద్దంకి అనంత రామయ్య), స్మశానం దున్నేరు (కేశవరెడ్డి) అనువాదాలు: జమీల్యా (చంగిజ్ ఐతమతోవ్: అను: ఉప్పల లక్ష్మణ రావు), ఓ మనిషి కథ - శివశంకరి (అను:మాలతీ చందూర్), ఆణిముత్యాలు (తమిళ కథలు) (అను: గౌరీ కృపానందన్), ఆరడుగుల నేల - చలసాని ప్రసాదరావు, మాస్తి చిన్న కథలు, మంటో కథలు ఆత్మకథలు- జీవిత చిత్రణలు:  నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు (మురారి), కాశీయాత్ర (చెల్లపిళ్ల వెంకటశాస్త్రి), చాప్లిన్ ఆత్మకథ (అను: వల్లభనేని అశ్వినీ కుమార్), హాస్యనట చక్రవర్తి (టి.ఎస్.జగన్మోహన్), 1948 హైదరాబాద్ పతనం (మహమ్మద్ హైదర్), కెవి.రెడ్డి శతజయంతి సంచిక (హెచ్.రమేశ్‌బాబు), జైలు లోపల (వట్టికోట ఆళ్వారుస్వామి), రంగనాయకమ్మ- ఆత్మకథాంశాల ఉత్తరాలు, శోభన్‌బాబు ఆత్మకథ (ఆకెళ్ల రాఘవేంద్ర), విప్లవజ్యోతి అల్లూరి (ఎం.వి.ఆర్.శాస్త్రి), తిరుమల లీలామృతం- పి.వి.ఆర్.కె. ప్రసాద్ సాహితీ వ్యాసాలు: కథలెలా రాస్తారు? (శార్వరి), సంభాషణ (సింగమనేని నారాయణ), రాగం భూపాలం (పి.సత్యవతి), సోమయ్యకు నచ్చిన వ్యాసాలు (వాడ్రేవు చినవీరభద్రుడు), మన తెలుగు నవలలు (డియాల రామ్మోహన్ రాయ్), సమకాలీనం (ఏ.కె.ప్రభాకర్), కథాశిల్పం (వల్లంపాటి వెంకటసుబ్బయ్య) కవిత్వం: దేశభక్తి గేయాలు (సంకలనం: మువ్వల  సుబ్బ రామయ్య), ఆటవెలదిలో ఆణిముత్యాలు (డా.కొలగోట్ల సూర్య
 ప్రకాశరావు), పిట్ట కూడా ఎగిరిపోవలసిందే (దేవీప్రియ).

ఇంగ్లిష్:
 The Little Bookstore of Big Stone Gap -    Wendy Welch  
 When I stop talking you know I am dead -     Jerry Weintraub
 Where The Peacocks Sing -     Alison Singh Gee
 No Easy Day: The autobiography of a Navy Seal-  Mark Owen;
 When the Mob Ran Vegas -     Steve Fischer
 Undergrounds: The Story of Coffee; where it began, how it
 spread -     Marc Pendergrast.
 I Too Had a Dream -     PJ Kurien.
 Pataudi -     Suresh Menon (ed)
 I Bury My Dead -      James Hadley Chase
 It Does Not End -      Maitreyi Devi
 Samskara -     U.R. Anantha Murthy (Tr: A. K. Ramanujan)
 The Jungle Book -     Rudyard Kipling; an old classic.
 Understanding Creativity -     Jane Piirto
 The Cinema of George Lucas -     Marcus Hearn.
 Picasso and Chicago -      Stephanie Alessandro.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement