కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల కారణంగా గత రెండు దశాబ్దాలపై నుండి వ్యవసాయరంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొం టోంది. ఇందులో భాగంగానే గత్యంతరం లేని పరిస్థితు ల్లో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, తమ బతుకులు బాగవు తాయని రైతాంగం పెట్టుకున్న ఆశలు అడియాసలై, గతంలో మాదిరిగానే రైతు ఆత్మహత్యలు కొనసాగుతు న్నాయి. రైతు ఆత్మహత్యల నివారణకు అవసరమైన చర్యలు తీసుకొని, రైతులకు భరోసా కల్పించమనీ, రైతు చనిపోయిన కుటుంబాలను ఆదుకోమనీ, రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు, అన్ని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ వచ్చాయి.
ఎట్టకేలకు రైతు ఆత్మహత్యలు జరిగిన కుటుంబాలకు సాయంగా 5లక్షలు, అప్పులు తీర్చడానికి రూ.లక్ష పెంచుతున్నట్లుగానూ, వ్యవసాయ విస్తరణాధి కారులను వెయ్యిమందిని నియమించబోతున్నట్లు గానూ కేసీఆర్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం చేసింది. కానీ, వాస్తవంగా రైతుల బ్యాంకుల అప్పులు ఒక లక్ష వరకు రద్దు అనే నిర్ణయం కొత్తది కాదు. దాన్ని 2014 జూన్ 2నే ప్రకటించి, అమలు చేస్తున్నా రు.
అందువల్ల, వాస్తవంగా పెంచింది గతంలో ఇస్తున్న రూ.లక్షన్నర నుండి 5లక్షలకు మాత్రమే. అంతేగాక, రైతు ఆత్మహత్య వల్ల ఆ కుటుంబానికి పెరిగిన సాయం సెప్టెంబర్ 19 నుండి మాత్రమే అమలులోకి వస్తుందని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చిన జూన్ 2, 2014 నుండి 18.9.2015 మధ్య చనిపోయిన రైతు కుటుంబా లకు పెంచిన సాయం వర్తింపజేయకపోవడం అత్యంత వివక్షతా పూరితమైంది. ‘‘చనిపోయిన రైతు కుటుంబా లకు పెంచిన సాయం ఇవ్వం; ఇక ముందు ఆత్మహత్య చేసుకుంటే సాయం పెంచి ఇస్తామని చెప్ప డం’’ అత్యంత అనాలోచితమైంది; దుర్మార్గమైంది. కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రైతు ఆత్మహత్యలు జరిగిన కుటుంబాలకు పెంచిన సాయం, అమలు చేయా లనీ, కరువు సహాయక చర్యలు ముందుగా రబీ పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వడ్డీలేని అప్పు, తదితర సహాయక చర్యలు చేపట్టాలని కేసీఆర్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
- రాయల సుభాష్ చంద్రబోస్,
సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి,
తెలంగాణ రాష్ట్ర కమిటీ
ఆత్మహత్యలకు సాయంలోనూ వివక్షే
Published Mon, Sep 21 2015 1:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement