అందరికీ సమాన విద్య ఎప్పటికీ మిథ్యేనా..? | education will never be the same for everyone ? | Sakshi
Sakshi News home page

అందరికీ సమాన విద్య ఎప్పటికీ మిథ్యేనా..?

Published Wed, May 27 2015 12:07 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

అందరికీ సమాన విద్య ఎప్పటికీ మిథ్యేనా..? - Sakshi

అందరికీ సమాన విద్య ఎప్పటికీ మిథ్యేనా..?

సందర్భం
 
ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి 50 మంది విద్యార్థుల్లో ఉన్నత విద్యకు వెళ్లి స్థిరపడేవారు సగటున కేవలం నలుగురేనట. మిగతా 46 మంది పాఠశాల స్థాయిలోనే నిలిచిపోవడంతో వారి జీవితాలు ఆగమవుతున్నాయి. ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ బడులకు వెళ్లే వారిలో 80 శాతం మంది బడుగు, బలహీనవర్గాలకు చెందిన వర్గాలవారే అధికం.
 
 ఉన్నత విద్యారంగంలో ప్రవే శానికి పదో తరగతే తొలిమె ట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీ వలే వెల్లడైన ‘పది’ ఫలితాల్లో ఎప్పటిలాగే బాలురుకన్నా బాలికలే పైచేయి సాధించారు. అబ్బాయిలకంటే తామే చదు వుల్లో మేటి అని మళ్లీ నిరూ పించుకున్నారు. కటిక పేదరి కంతో ప్రభుత్వ బడుల్లో చదువుకుని విద్యా సుగంధాలు విరజిమ్మే వరంగల్ జిల్లా కేసముద్రానికి చెందిన సృజన లాంటి కుసుమాలు కొందరైతే... పాఠశాలల్లో మౌలిక వసతుల్లేక చదువుల్ని మధ్యలోనే చాలిస్తున్న విద్యార్థులు మరెందరో. అంతరాలున్న మన సమాజంలో అందరికీ సమానమైన విద్య మిథ్యగానే మిగిలిపోతోంది.

అందుకే నాణ్యమైన విద్య అందిస్తామని గత ఆరు న్నర దశాబ్దాలుగా పాలకులు చెబుతోన్న మాటలు ఎండ మావులే అవుతున్నాయి తప్ప నేటికీ సాకారమైంది లేదు. (పాలకుల మాయ మాటలకు తలొగ్గుతోన్న సగటు మని షి తన పిల్లల చక్కటి బతుకుకు కచ్చితమైన భరోసా కల్పిం చలేక తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నా డు.) కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తా మన్న తెలంగాణ ప్రభుత్వ ప్రకటన ప్రజల్లో గంపెడా శల్ని నింపింది. వన్నె కోల్పోయిన సర్కారీ బడులు మళ్లీ ఇప్పుడు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటా యని ప్రజల్లో చిగురించిన ఆశల్ని నెరవేర్చాల్సిన బాధ్య త ప్రభుత్వంపైనే ఉంది.

 తెలంగాణ రాష్ట్రంలో బడులకు వెళ్లి చదువుకుంటు న్న విద్యార్థుల సంఖ్య కంటే బడి బయట ఉండే పిల్లలే అధికంగా ఉంటున్నారు. వీరిలో బాలికలే అత్యధికం. ముఖ్యంగా గ్రామీణ పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఆడపిల్లలు పెద్ద మొత్తంలో చదువుకు దూరమ వుతున్నారు. మైనార్టీ, గిరిజనవర్గాలకు చెందిన పిల్లల ఎన్‌రోల్‌మెంట్ కూడా కనిష్టస్థాయిలోనే ఉంది. మనిషికి కావాల్సిన కనీస అవసరాలైన కూడు. గూడు, గుడ్డ వం టి మౌలిక వసతులు కొరవడటం వల్లనే చాలా మంది చిన్నారులు బడి గడప తొక్కలేకపోతున్నారు. బడులకు వెళ్లి చదువుతున్న విద్యార్థులు మాత్రం అంతంత మాత్రంగానే రాణిస్తున్నారు.

 ప్రభుత్వం జిల్లాల వారీగా ఫలితాలను విశ్లేషించి వెనుకబడిన జిల్లాల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రయత్నం చేయాలి. సమాజంలో వివిధ వర్గాలలో నెల కొన్న అంతరాలు తొలగిపోవాలంటే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వారిని మరింతగా ప్రోత్స హించాలి. మారిన ఆర్థిక, సామాజిక విధానాల వల్ల ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలంటే గణి తం, సైన్స్, ఇంగ్లిష్ వంటి సబ్జెక్టుల్లో మంచి ప్రావీణ్యత అవసరం లేనట్లయితే విద్యార్థులు సరైన ఉపాధి అవ కాశాలను అందిపుచ్చుకోలేరు. పరీక్షల్లో ఉత్తమ ఫలి తాలు సాధించడం ఎంత ముఖ్యమో... వాటి ద్వారా భవిష్యత్తులో ఉపాధి పొందడం అంతే అవసరం.

 ఎన్నో వ్యయప్రయాసలు పడి పదో తరగతిలో మం చి గ్రేడ్లతో పాసైన విద్యార్థులకు ఇంటర్ విద్యే గగనమైన రోజులివి. ప్రస్తుతం పాఠశాల విద్యతో పాటుగా ఇంటర్ చదువంతా కార్పొరేట్ కాలేజీల హస్తగతమైంది. దీనివల్ల ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఫీజుల భారం మోయ లేక అర్థాంతరంగా చదువులకు స్వస్తి చెబుతున్నారు. ప్ర భుత్వకాలేజీ వ్యవస్థను పటిష్టపరిస్తే ఈ దుస్థితి తప్పు తుంది. కేరళలో ప్రభుత్వరంగంలో నాణ్యమైన విద్యను అందించడం వల్ల పేద వర్గాల పిల్లలు ప్రపంచ స్థాయిలో పలు రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు పొందుతు న్నారు. తద్వారా దారిద్య్రరేఖను అధిగ మించారు.

 గత ఆరున్నర దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించినా వారిలో విద్యానాణ్యత ప్రమా ణాలు మాత్రం మెరుగుపడలేదు. వరంగల్, మహబూ బ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇటీవలే వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ నమూనా సర్వే లో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ బడుల్లో విద్యనభ్యసించే ప్రతి 50 మంది విద్యార్థుల్లో ఉన్నత విద్యను చదివి జీవితంలో స్థిరపడేవారు సగటున కేవలం నలుగురేనట. మిగతా 46 మంది పాఠశాల స్థాయిలో సరైన విద్యాప్రమాణాలు లేకపోవడం, కుటుం బ పరిస్థితులు సహకరించని కారణంగా వారి జీవితాలు ఆగమవుతున్నాయి. ఆడపిల్లల పరిస్థితి మరింత దారు ణంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ బడులకు వెళ్లే వారిలో 80 శాతం మంది బడుగు, బలహీనవర్గా లకు చెందిన వారే అధికం. ప్రభుత్వ గురుకుల పాఠ శాలల్లో విద్యనభ్యసిస్తున్న పిల్లలు చాలా మెరుగ్గా ఉన్నట్లు సర్వే ద్వారా గుర్తించారు. అందువల్ల ప్రభు త్వాలు సామాజిక బాధ్యతతో పేద పిల్లల చదువుకు భరోసాగా నిలిచే సామాజిక పరివర్తనకు కృషిచేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించాలి.

 ప్రపంచీకరణ నేపథ్యంలో వర్ధమాన దేశాలు తమ దేశ పౌరుల ఉజ్జ్వల భవిష్యత్తుకు ఉద్యోగ, ఉపాధి అవకా శాలే లక్ష్యంగా విద్యా వ్యవస్థను చక్కదిద్దుకుంటున్నా యి. మార్కెట్ వ్యవస్థ సృష్టించిన ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే అందుకనుగుణమైన నైపుణ్యాలు అవసరం. నాణ్యమైన నైపుణ్యాలు కలిగిన చదువు మన విద్యార్థులకు అందినప్పుడే వాళ్లు దేశానికి అపార సం పదగా మారతారు. ఏ దేశానికైనా మానవ వనరులే ప్రధానం. అది మన దగ్గర అపరిమితంగా ఉంది. ఆ వన రులకు తగిన శిక్షణ ఇచ్చి సాంకేతికతను జోడిస్తే రాబో యే రోజుల్లో మన విద్యార్థులు అద్భుతాలు సాధిస్తారు. రాష్ట్ర పురోగతికి బాటలు వేస్తారు. ఇలాంటి సమగ్ర అభివృద్ధికి విద్యారంగమే కార్యక్షేత్రం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను.
 (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement