గ్రహం అనుగ్రహం
శ్రీమన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
నిజ ఆషాఢ మాసం,తిథి శు.అష్టమి సా.6.19 వరకు
తదుపరి నవమి, నక్షత్రం చిత్త ఉ.6.30 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం ప.12.44 నుంచి 2.30 వరకు
దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి 9.04 వరకు
తదుపరి ప.12.34 నుంచి 1.24 వరకు
అమృతఘడియలు రా.11.01 నుంచి 12.24 వరకు
సూర్యోదయం: 5.39
సూర్యాస్తమయం: 6.33
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు.
భవిష్యం
మేషం: పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలందుతాయి. విందు వినోదాలు. దూరపు బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
వృషభం: దైవదర్శనాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కార్యసిద్ధి. వస్తు లాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభ వార్తలు. వ్యాపార, ఉద్యోగాల్లో నూతనోత్సాహం.
మిథునం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విభేదాలు రావచ్చు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. దైవ చింతన. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
సింహం: పనులు చకచకా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. విందు వినోదాలు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహన యోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి.
కన్య: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు జరగవచ్చు. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.
తుల: ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
వృశ్చికం: వ్యయ ప్రయాసలు. ఇంటా బయటా చికాకులు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ప్రయాణాలలో మార్పులు ఉండొచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిడులు.
ధనుస్సు: వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాల్లో నూతనోత్సాహం.
మకరం: పనుల్లో పురోగతి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
కుంభం: పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బంధువులతో అకారణంగా తగాదాలు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
మీనం: దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం. వ్యవహారాల్లో అవరోధాలు కలుగుతాయి. బంధువులతో తగాదాలు రావచ్చు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు