
గ్రహం అనుగ్రహం, గురువారం 31 డిసెంబర్ 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి బ.షష్ఠి రా.7.04 వరకు
నక్షత్రం పుబ్బ సా.5.57 వరకు
తదుపరి ఉత్తర, వర్జ్యం రా.1.52 నుంచి 3.38 వరకు,
దుర్ముహూర్తం ఉ.10.17 నుంచి 11.06 వరకు,
తదుపరి ప.2.44 నుంచి 3.32 వరకు
అమృతఘడియలు ఉ.11.02 నుంచి 12.48 వరకు
సూర్యోదయం : 6.34
సూర్యాస్తమయం : 5.32
రాహుకాలం : ప.1.30 నుంచి 10.30 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
భవిష్యం
మేషం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. దూర ప్రయాణాలు చేస్తారు. ఆస్తి విషయంలో చికాకులు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
వృషభం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. విద్యార్థుల యత్నాలలో అవరోధాలు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మిథునం: ఆకస్మిక ధన లాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దైవ దర్శనాలు. విందు వినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోభివృద్ధి.
కర్కాటకం: శ్రమ తప్పదు. పనులు మధ్యలో విరమిస్తారు. సోదరులు, సోదరీలతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటర్వ్యూలు రాగలవు. వస్తులాభాలు. భూ, గృహప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దైవ దర్శనాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
తుల: బంధువులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
వృశ్చికం: ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉండవచ్చు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.
ధనుస్సు: బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మకరం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవచింతన.
కుంభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మీనం: దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఇంటా బయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. వాహన యోగం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు