
గ్రహం అనుగ్రహం, మార్చి 22, 2016
శ్రీమన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణమాసం
తిథి శు.చతుర్దశి ప.2.39 వరకు
తదుపరి పౌర్ణమి నక్షత్రం పుబ్బ ప.4.01 వరకు
తదుపరి ఉత్తర వర్జ్యం రా.11.51 నుంచి 1.33 వరకు
దుర్ముహూర్తం ఉ.8.28 నుంచి 9.18 వరకు,
తదుపరి రా.10.55 నుంచి 11.44 వరకు
అమృతఘడియలు ఉ.8.46 నుంచి 10.29 వరకు
భవిష్యం
మేషం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు. దైవ దర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.
వృషభం: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఒత్తిడులు ఎదుర్కొంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం నెలకొంటుంది.
మిథునం: పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. అప్రయత్న కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కర్కాటకం: వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. బంధువులతో అకారణంగా విభేదాలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ.
సింహం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో ఆదరణ. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.
కన్య: బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
తుల: పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. మీ సత్తా చాటుకుంటారు. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
వృశ్చికం: యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. వాహన యోగం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా నిరుత్సాహం నెలకొంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కలహాలు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.
మకరం: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కొత్తగా రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కుంభం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వస్తు, వస్త్ర లాభాలు. వాహన యోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.
మీనం: చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలు. కార్య జయం. వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు