
గ్రహం అనుగ్రహం, బుధవారం 09, మార్చి 2016
శ్రీ మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం,
తిథి అమావాస్య ఉ.8.06 వరకు,
తదుపరి ఫాల్గుణ శు.పాడ్యమి తె.5.58 వరకు (తెల్లవారితే గురువారం),
నక్షత్రం పూర్వాభాద్ర రా.10.34 వరకు,
వర్జ్యం ఉ.6.00 నుంచి 7.33 వరకు,
దుర్ముహూర్తం ప.11.43 నుంచి 12.33 వరకు,
అమృతఘడియలు ప.3.04 నుంచి 4.36 వరకు
సూర్యోదయం : 6.17
సూర్యాస్తమయం: 6.04
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
సూర్యగ్రహణం: (ఉ.5.46-9.08వరకు)
భవిష్యం
మేషం: పనుల్లో పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృషభం: విద్య, ఉద్యోగావకాశాలు. యత్న కార్యసిద్ధి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందు వినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.
మిథునం: మిత్రులతో కలహాలు. రుణ యత్నాలు చేస్తారు. ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: కొత్తగా రుణాలు చేస్తారు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దైవ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
సింహం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూ లాభాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక అభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తిలాభం. కార్యజయం. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
తుల: ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనులలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బంధువర్గంతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
ధనుస్సు: ఉద్యోగప్రయత్నాలు సఫలం. విందు వినోదాలు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. వస్తు లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
మకరం: కుటుంబంలో చికాకులు రావచ్చు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. సోదరులు, మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు నెలకొంటాయి.
కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్య కరమైన విషయాలు తెలుసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూ లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి ఉంటుంది.
మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలుపెరుగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.
- సింహంభట్ల సుబ్బారావు