హైదరాబాద్: మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మీడియా సలహాదారుగా, తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా, డాక్టర్ ఎంసీఆర్ మానవ వనరుల అభివద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌గా ఐఏఎస్ అధికారిగా పీవీఆర్‌కే ప్రసాద్ ఎనలేని సేవలు చేశారు. ఆయన ఎప్పుడు, ఏ విభాగంలో పనిచేసినా ఆ విభాగం అభివద్ధికి అంకిత భావంతో అవిశ్రాంతంగా పనిచేశారు. ముఖ్యంగా ఆయన మానవ వనరుల అభివద్ధి డైరెక్టర్ జనరల్‌గా అందించిన సేవలు మరువలేనివి. మకుటాయమానమైనవి.
1988లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన ఈ విభాగం అధిపతిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి అత్యున్నత ప్రభుత్వోద్యోగి వరకు రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగుల పనితీరును విశ్లేషించి, వారికి ఎప్పటికప్పుడు వివిధ విభాగాల్లో అవసరమైన శిక్షణ ఇవ్వడం, వారిని వత్తిలో రాణించేలా తీర్చిదిద్దడం డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థ పని.
ఈ సంస్థ పనులు కుంటినడక నడుస్తుండడంతో చంద్రబాబు సూచన మేరకు నేను మరో విభాగంలో పనిచేస్తున్న పీవీఆర్‌కే ప్రసాద్‌ను కలుసుకున్నాను. హెచ్‌ఆర్‌డీ విభాగం పనులు, విధి విధానాల గురించి నేను ఆయనకు విడమర్చి చెబుతున్నాను. అంతలోనే బాబు నుంచి 15 నిమిషాల్లో వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా ఫోన్ వచ్చింది. నేను ఈలోగా గబాగబా హెచ్చార్డీ విభాగం గురించి తెల్సిన మేరకు ఆయనకు వివరించారు.
ఆ తర్వాత ఇద్దరం కలసి సీఎం చంద్ర బాబు వద్దకు వెళ్లాము. హెచ్చార్డీ విభాగం గురించి ఏం తెలుసునని ఆయన్ని బాబు ప్రశ్నించారు. ఆ విభాగం మీద మూడేళ్ల అనుభవం ఉన్నట్లు ప్రసాద్ గారు ముచ్చటగా వివరించారు. వెంటనే ఆయన్ని ఆ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా బాబు నియమించారు. హెచ్చార్డీ కార్యాలయం జూబ్లీ హిల్స్‌లోని 25వ నెంబర్ రోడ్డులో ఉన్నప్పటికీ ఎలాంటి అందులో ఎలాంటి సదుపాయాలు లేవు. ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ముందుగా కార్యాలయాన్ని అభివద్ధి చేశారు. ఇప్పుడు అందులో ఉన్న సదుపాయాల్లో 90 శాతం ఆయన ఏర్పాటు చేసినవి. కార్యాలయంలో ఏ మూల చూసిన ఆయన ప్రత్యేక ముద్రే నేటికి కనిపిస్తుంది.
ప్రసాద్ గారు హెచ్చార్డీ ఆధ్వర్యంలో ‘స్టేట్ ట్రేనింగ్ ఇన్సియేటివ్’ కార్యక్రమం కింద ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగులకు శిక్షణ ఇస్తూ వచ్చారు. అదే కార్యాలయంలో సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెస్ (సీజీజీ)ని ప్రసాద్ ఏర్పాటు చేశారు. దీన్ని అప్పటి ఇంగ్లండ్ ప్రధాన మంత్రి టోని బ్లెయిర్ ఇక్కడికి వచ్చి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కేంద్రం లక్ష్యాలను ఆయన ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతోని కూడా టోని బ్లెయిర్ చాలాసేపు చర్చించారు. అలాగే ప్రసాద్, అంతర్జాతీయ కార్మిక సంఘం, వీవీ గిరి నేషనల్ లేబర్ ఇనిస్టిట్యూట్‌తో కలసి రాష్ట్రంలో బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
తాను హెచ్చార్డీ బాధ్యతలు స్వీకరించిన ఎనిమిది నెలల కాలంలోనే సంస్థకు ‘ఐఎస్‌ఓ 9007 2000’ సర్టిఫికెట్ సాధించి పెట్టారు. ఉన్నత ప్రమాణాలను సూచించే ఈ సర్టిఫికెట్ జాతీయ స్థాయిలో ఓ రాష్ట్ర సంస్థకు రావడం బహూశా అదే మొదటి సారి కావచ్చు. అంతటి మహానుభావుడు నేడు మన మధ్యలో లేరని చెప్పడానికి విచారిస్తున్నాను. ఆయన ఆగస్టు 21, అంటే సోమవారం పరమపదించారు. ఆయన తెలుగులో పలు మంచి పుస్తకాలు కూడా రచించారు. నహం కర్త, అసలేం జరిగిందంటే, తిరుమల లీలామతం, తిరుమల చరిత్రామతం పాఠకులను ఆకట్టుకున్నాయి.
-- వనం జ్వాలా నరసింహారావు
పదవులకే వన్నెతెచ్చిన పీవీఆర్‌కే ప్రసాద్
Published Wed, Aug 23 2017 8:27 PM | Last Updated on Tue, Sep 12 2017 12:51 AM
Advertisement
Advertisement