యానాంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కళాశాలలో ఫిబ్రవరి 23న ‘ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషా సాహిత్య అంశాల తులనాత్మక అధ్యయనం’ అంశంపై సదస్సు జరగనుంది.
భాషా సాహిత్యాల అధ్యయనం
యానాంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కళాశాలలో ఫిబ్రవరి 23న ‘ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషా సాహిత్య అంశాల తులనాత్మక అధ్యయనం’ అంశంపై సదస్సు జరగనుంది. కీలకోపన్యాసం: శిఖామణి. సి.రత్నఘోష్ కిశోర్, మణివేళ్, టి.విశ్వనాథరావు, కోయి కోటేశ్వరరావు, విస్తాలి శంకరరావు, దాట్ల దేవదానం రాజు పాల్గొంటారు. పత్ర సమర్పకులు పాల్గొనవలసిందిగా ప్రిన్సిపల్ టి.సెల్వం కోరుతున్నారు. వివరాలకు: 9440127967
146 మంది పత్ర సమర్పణ
మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ‘పరిశోధన: నాడు, నేడు, రేపు’ పేరిట జరగనున్న అంతర్జాతీయ సదస్సులో 146 మంది పరిశోధకులు వివిధ అంశాలపై పత్ర సమర్పణ చేయనున్నారు. ‘కవిత్రయ మహాభారతం-వ్యక్తిత్వ వికాసం’తో ప్రారంభమై, ‘ఎరుకల భాష- ఒక పరిశీలన’తో ముగిసే ఈ సదస్సు వేదిక: చెన్నైలోని విశ్వవిద్యాలయ రజతోత్సవ ప్రాంగణం, మెరీనా క్యాంపస్. అధ్యక్షులు: రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. పరిశోధన పత్రాల పుస్తకావిష్కరణ: చిలకం రామచంద్రారెడ్డి. ఇందులో, పి.డేవిడ్ కుమార్, శ్రీనివాసరెడ్డి, కొంచాడ మల్లికేశ్వరరావు, బూదాటి వేంకటేశ్వర్లు, జి.వి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి, మాడభూషి సంపత్‌కుమార్, విస్తాలి శంకరరావు, వెలుదండ నిత్యానందరావు, నాగసూరి వేణుగోపాల్, గుమ్మా సాంబశివరావు, మేడిపల్లి రవికుమార్, పేట శ్రీనివాసరెడ్డి, ఎస్.జయప్రకాశ్, శారద, పుల్లూరి ఉమ తదితరులు పాల్గొంటారు.
చింతపట్ల పుస్తకావిష్కరణ
పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో- చింతపట్ల సుదర్శన్ ‘సుదర్శన్ సెటైర్స్ ః తెలంగాణ.కామ్’, గొట్టిపర్తి యాదగిరి రావు ‘విస్ఫోటనం’ పుస్తకాల ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 25న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో జరగనుంది. అమ్మంగి వేణుగోపాల్, ఎస్వీ సత్యనారాయణ, అంబటి సురేంద్రరాజు, ఏనుగు నరసింహారెడ్డి, కె.పి.అశోక్‌కుమార్, గుడిపాటి పాల్గొంటారు.