సేకరణ కారాదు గుదిబండ | mahesh vijakrupar special story on Land acquisition | Sakshi
Sakshi News home page

సేకరణ కారాదు గుదిబండ

Published Tue, Jan 10 2017 1:56 AM | Last Updated on Mon, Oct 1 2018 3:56 PM

సేకరణ కారాదు గుదిబండ - Sakshi

సేకరణ కారాదు గుదిబండ

భూమిని వదులుకున్న వ్యక్తే ఆ ప్రాజెక్టు వల్ల తక్కువ లబ్ధిని పొందేవాడు కారాదు. మీ భూమి వల్ల ప్రాజెక్టు వస్తే, అ తర్వాత కలిగే లాభాలు ఇతరులకు వస్తాయి. కాబట్టి వారు మీకు కూడా ఆ లాభాల్లో ఓ వాటా లభించాలి.

భూ యాజమాన్యం, ప్రత్యే కించి వ్యవసాయ భూమిపైన యాజమాన్యం రైతుకు సంబంధించి తన సొంత అస్తి త్వంగాను, తన మూలాధారం గాను కూడా ఉంటుంది. ఆ భూమికి దూరమై బతకడం రైతుకు కష్టం. అందువల్లే ఒక ప్రాజెక్టును ప్రారంభించిన ప్రతిసారీ అక్కడి రైతాంగంలో అసంతృప్తి నుంచి ఆందోళన వరకు రేగుతుంటుంది. భూసేకరణ అంటే భూయజమానులు దరిద్రులు కావడంగా ఉన్నంత కాలం ఆ ఆగ్రహం సమంజసమైనది.

పోచంపాడు ప్రాజెక్టు లేదా నర్మద డామ్‌ వంటి పాతవేగానీ లేదా ఏదైనా ప్రధాన రహదారి లేదా సింగూరు లేదా మరేదైనా గానీ... భూమిని అందించిన యజమానులకు విదిలిస్తున్నది స్వల్ప మొత్తాలే. అవి కూడా అధికార యంత్రాంగానికి అలవాటైన అలసత్వం ఫలితంగా ఎన్నో జాప్యాల తర్వాత అందేవే. అంతేగాని వారు సదరు ప్రాజెక్టు లబ్ధిదారులు కావడం మాత్రం జరగడం లేదు. దీని వల్ల కలిగే బాధ ఎలాంటిదో భూమిని కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది. రైతు అంటే ఒక అమూర్త భావన, సర్వనామం, మహా అయితే ఒక గణాంకం అంతే.

ఒక డ్యామ్‌ రిజార్వాయర్‌ వల్ల మీ భూమి ముంపు నకు గురికాగా, మరెక్కడో సుదూరంలో మీకు తెలియ నైనా తెలియనివారు లబ్ధిని పొందుతున్నçప్పుడు ఆ బాధ మరింత దుర్భరం. ఇంతటి బాధకు గానూ వారికి దక్కేది వారి అమూల్యమైన భూమికి బదులుగా ఇచ్చే కొన్ని చిల్లర కాసులు. లాభం తక్కువ అనే దానితో సంబంధం లేకుండా ఆస్థికి అంటిపెట్టుకుని ఉండటం భారత వ్యవసాయపు ప్రామాణిక లక్షణం. అది అస మానతలను అధ్వానంగా దిగజార్చకపోయినా పెంపొం దేట్టు చేస్తుంది.

సింగూరులో టాటాలకు కేటాయించిన భూమిని వారు కోల్పోయినప్పుడు... ఇది వారి వ్యాపారాన్ని దెబ్బ తీస్తుందని వారి పట్ల ఎంతో సానుభూతి వ్యక్తమైంది. కానీ రైతుల బాధను వ్యక్తం చేసిన ఒక రాజకీయ పార్టీని మాత్రం విచ్ఛిన్నకరమైనదిగా చూశారు. ఆ సమయంలో నేను రైతులను తోసి పారేసే కన్నా ఆ ప్రాజెక్టులో వ్యాపార భాగస్వాములను చేయాలని వాదించాను. ఏ ప్రాజెక్టునయినాగానీ భూమి లేకుండా నిర్మించలేం. ‘ప్రజా ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకోడానికి’ ప్రభుత్వానికి ఉన్న పాత హక్కు భూయాజమాన్య హక్కును పరిహాసాస్పదంగా మార్చింది. అదృష్టవ శాత్తూ ఆ దృక్పథం మారుతోంది.

అమరావతి కోసం ల్యాండ్‌ పూలింగ్‌ చేపట్టిన తదుపరి మహారాష్ట్ర కూడా భూయజమాని అమ్ముతున్న భూమికి ఎకరానికి... మాగాణి అయితే రూ. 45,000, మెట్టయితే రూ. 30,000 వార్షిక రాబడికి హామీ ఉండేలా చేస్తోంది. అలాగే ముంబై–నాగపూర్‌ల మధ్య 750 కిలోమీటర్ల  ‘సమృద్ధి కారిడార్‌’ నిర్మాణం కోసం సేకరిం చనున్న భూమికి ఈ వార్షిక రాబడిని రూ. 60,000గా నిర్ణయించింది. ఈ రహదారి పొడవునా వృద్ధి కేంద్రాలు (చిన్న పట్టణాలు)  ఉంటాయి. పది జిల్లాల గుండా సాగే ఆ భారీ రహదారి వెంబడి ఏర్పడే వృద్ధి కేంద్రాలకు ఆనుకుని ఉన్న అభివృద్ధి పరచిన ప్లాట్లను ప్రభుత్వం భూములను సేకరించిన వ్యక్తులకు ఇస్తుంది.

అలా ఇచ్చే ప్లాటు విస్తీర్ణం ఇచ్చిన భూమిలో 25 శాతంగా నిర్ణయిం చారు. ప్రస్తుత చట్టాన్ని, పద్ధతులను అనుసరించి ఇచ్చే పరిహారం కాక ఇది పదేళ్లపాటు లభిస్తుంది. దీంతో పరిస్థితి మొత్తంగా మారిపోయిందని దీని అర్థం కాదు. మారుతూ ఉన్నది అనేదే నేను చెబుతు న్నది. ఒక వ్యక్తిని బంధించి ఉంచే అనుబంధాలు, అతని జీవితాన్ని అర్థవంతం చేస్తున్న వ్యక్తిగత సంబంధాలు, సామాజిక అనుసంధానాలు ఉన్న చోటి నుంచి పెళ్లగించి వేస్తున్నప్పుడు.. దీనిని ఇప్పటికైతే పరిపూర్ణమైన ప్యాకేజీ అనొచ్చు. ఈ నమూనాలను మరింత సంపూర్ణమైనవిగా మార్చే పని సాగుతూనే ఉండాలి. ఆ దిశగా కొన్ని సూచనలు.

ప్రాజెక్టు వ్యవస్థాపకుడు (ప్రమోటరు) మదుపరు లకు షేర్లను జారీ చేసినట్టుగానే భూ యజమానిని కూడా తమ భాగస్వామిని చేసుకోవాలి. భూ యజమా నికి ఇచ్చే వాటా అతనికి చెల్లించాల్సిన మార్కెట్‌ ధరకు బదులుగా ఇచ్చేది కారాదు. దానికి అదనంగా, ఒక విలువైన అస్తిని సమకూరుస్తున్నందుకుగానూ అతనికి చెల్లించేది కావాలి. అతడు సహ వ్యాపారి కాబట్టి అతడు చేకూర్చేదాని ధరకు విభిన్నమైనదైన కొంత విలువ అత నికి లభించాలి. ఇది, పారిశ్రామిక రంగం భూమిని చౌకగా లభించే వనరుగా చూడటాన్ని అంతం చేస్తుంది.

సేకరించిన భూమిలో నిర్మించే ప్రాజెక్టు వల్ల దాని చుట్టుపక్కల భూముల ధరలు కొంత కాలానికి పెరి గినప్పుడు... ముందుగా భూభాగాన్ని సమకూర్చిన భూయజమానికి ఆ సూచీని అనుసరించి అదనపు పరిహారం లభించాలి. భూమిని వదులుకున్న వ్యక్తే ఆ ప్రాజెక్టు వల్ల తక్కువ లబ్ధిని పొందేవాడు కారాదు. మీ భూమి వల్ల ప్రాజెక్టు వస్తే, అ తర్వాత కలిగే లాభాలు ఇతరులకు వస్తాయి. కాబట్టి వారు మీకు కూడా ఆ లాభాల్లో ఓ వాటా లభించడానికి హామీని కల్పించాలి. నిజమే, ఇది సంక్లిష్టమైనదే. కానీ ఆచరణసాధ్యం కానిది మాత్రం కాదు.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు, మహేష్ విజాపృకర్
ఈ మెయిల్‌ : mvijapurkar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement