మన రక్షణకు తొలగిన చెర | Our defense has ceased captivity | Sakshi
Sakshi News home page

మన రక్షణకు తొలగిన చెర

Published Tue, Nov 25 2014 12:00 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM

మన రక్షణకు తొలగిన చెర - Sakshi

మన రక్షణకు తొలగిన చెర

కీలకమైన ఆయుధాలను దేశంలోనే తయారు చేసేందుకు వీలు కల్పిస్తూ రక్షణశాఖ భారీ కొనుగోళ్లకు పచ్చజండా ఊపటం శుభపరిణామం. కానీ కుంభకోణాలకు తావులేని వ్యవస్థను రూపొందించనంతవరకు రక్షణరంగంలో మౌలిక మార్పులను ఆశించలేం. మనోహర్ పారికర్ నిజాయితీ మాత్రమే దేశాన్ని కాపాడలేదు.
 
దేశీయ రక్షణావసరాలపై సుదీర్ఘకాలంగా గడ్డ కట్టు కుపోయిన మంచు కాస్త కరుగుతోందా? బోఫోర్స్ భూతం వెంటాడుతున్న రక్షణ శాఖకు ఉపశమనం కలిగేలా ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొం ది. భారత సైన్యానికి అత్యవసరమైన 814 శతఘు్న ల కొనుగోలుకు నూతన రక్షణమంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదముద్ర వేసింది. వీటి విలువ రూ.15,750 కోట్ల. 1980ల చివరలో బోఫోర్స్ తుపాకుల కుంభ కోణం తర్వాత మన సైన్యం ఒక్క ఫిరంగిని కూడా కొనుగోలు చేయలేదు.

ఈ కుంభకోణంతో గత ప్రభుత్వాలు ఆయుధాల కొనుగోలుపై తీసుకున్న కీలక నిర్ణయాలు గాలికెగిరిపోయాయి. పాతికేళ్ల పాటు నీరసించిపోయిన మన సైన్య ఆయుధ పాట వానికి కొత్త జవసత్వాలు కల్పిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. కొనడం తయారు చేయడం విధానం కింద 155 ఎం.ఎం/52 క్యాలిబర్ ఉన్న 100 శతఘు్నలను నేరుగా కొనుగోలు చేయడా నికి, మిగిలిన 714 శతఘు్నలను మన దేశంలోనే తయారు చేయడానికి నిర్ణయించింది.
 
అయితే గతానికి భిన్నంగా భారతీయ కంపెనీ లకు కూడా బిడ్ దాఖలు చేయవచ్చు. దీంతో దేశీ యంగా ఎల్ అండ్ టి, టాటా, భారత్ ఫోర్గే కంపె నీలు ఈ భారీ ప్రాజెక్టులో పాలుపంచుకోను న్నా యి. ఇవి బిడ్‌లో గెలిచినట్లయితే స్వయంగా కానీ లేదా విదేశీ కంపెనీలతో పొత్తు కుదుర్చుకుని కానీ, శతఘు్నలను ఇక్కడే తయారు చేయవచ్చు. భార తీయ వాయుసేన కోసం టాటా సన్స్, ఎయిర్ బస్ సంయుక్తంగా నిర్మించతలపెట్టిన 56 రవాణా విమా నాల తయారీ ప్రాజెక్టు ఆమోదం కోసం రక్షణ శాఖ అదనపు సమాచారం కోరింది. రూ.8,200 కోట్ల విలువైన 106 స్విస్ పిలాటస్ ప్రాథమిక శిక్షణ యుద్ధ విమానాల కొనుగోలును వాయిదా వేశారు.
 
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సైనిక సం పత్తి కలిగిన భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆయు ధాల కొనుగోలుదారు కూడా. తాజాగా కేంద్ర ప్రభు త్వం నూరు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ వ్యవ స్థల నవీకరణకు ప్రయత్నాలు చేపట్టింది. దీంతో దేశీయ రక్షణ పరిశ్రమకు నూతనోత్సాహం కలుగ నుందని నిపుణుల అంచనా. చైనా సైనిక శక్తితో పోటీ పడేందుకోసం భారతీయ సైన్యం ఆధునీకర ణకు నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.

దేశ పశ్చిమ సరిహద్దుల్లో తిష్టవేసి ఉన్న పాకిస్తాన్ సైన్యాలతో మన బలగాలు పేలవమైన ఆయుధా లతో తలపడుతున్నాయి. చివరకు వివాదాస్పద మైన హిమాలయా సరిహద్దుల్లో చైనా గస్తీ బలగాల ముందు కూడా మన సైనిక దళాలు తేలిపోతున్నా యి. ఈ నేపథ్యంలోనే కేంద్రం మన రక్షణ పాట వాన్ని బలోపేతం చేయడానికి నడుం బిగించింది.
 
కానీ రక్షణ కొనుగోళ్లలో వరుస కుంభకోణాలు మన సైనికపాటవాన్ని ఘోరంగా దెబ్బతీస్తూ వచ్చా యి. దేశ చరిత్రలో అతిపెద్ద రక్షణ కుంభకోణాల్లో ఒకటైన బోఫోర్స్ చేదు జ్ఞాపకాలు నేటికీ దేశాన్ని వెంటాడుతున్నాయి. 30 కిలోమీటర్ల పరిధి కలిగిన హోవిట్జర్ తుపాకుల కోసం భారతీయ సైన్యం ప్రక టించిన టెండర్‌ను స్వీడిష్ ఆయుధాల కంపెనీ బొఫోర్స్ సంస్థ భారీ ముడుపులిచ్చి హస్తగతం చేసు కుందని 1987 ఏప్రిల్ 16న స్వీడిష్ రేడియో బాంబు పేల్చింది. ఖత్రోచీ ఈ ఒప్పందం కుదిర్చినందుకు 3 శాతం కమిషన్ పుచ్చుకున్నారని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాధినేత రాజీవ్‌గాంధీకి కూడా ఈ కుంభకో ణంలో భాగముందని ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా 2012-13లో వెలుగులోకి వచ్చిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం మన రక్షణశాఖ ముడుపుల వాటం ఏమాత్రం తగ్గకుండా కొనసాగిం దని తేల్చి చెప్పింది.
 
టెక్నాలజీ తస్కరణకు పాల్పడినట్లు భావి స్తున్న బిఇఎమ్‌ఎల్ కుంభకోణంతో సహా స్కార్‌పెన్ సబ్‌మెరైన్, బోఫోర్స్, శవపేటికల కుంభకోణం, ఆగస్టా.. ఇవి మన రక్షణశాఖ నిర్వాకానికి పరాకాష్ట లుగా నిలిచిన కుంభకోణాలు. ఇవి సివిలియన్ కుం భకోణాల కంటే ప్రమాదకరంగా మన రక్షణకు తూ ట్లు పొడిచిన కుంభకోణాలు. వీటన్నిటి సారాంశం ఏమంటే రక్షణ శాఖలో, సాయుధ బలగాల్లో లంచ గొండులైన అధికారులు లెక్కకు మించి ఉన్నారనే. వీరి ముడుపుల వ్యవహారాలకు గాను విచారించి భారీ జరిమానాలు, కఠిన శిక్షలతో జైలుకు పంపిన ప్పుడే మన వ్యవస్థ మొత్తం పరిశుభ్రం కాగలదు.

టైజం గురించి మాట్లాడుతుంటాం. ఉగ్రవాదు లను ఉరి తీయాలని గావుకేకలు పెడుతుంటాం. కానీ యావజ్జాతిని లోపలనుంచే ధ్వంసం చేస్తున్న ఇలాంటి వేరుపురుగుల జోలికి మాత్రం మనం పోం. ఇది సాగినంతవరకు రక్షణ రంగం కుంభకో ణాలకు అతీతంగా ఉండటం అసాధ్యమే. మనోహర్ పారికర్ రూపంలోని ఒక నిజాయితీపరుడి చిత్తశుద్ధి మాత్రమే రక్షణ శాఖను శుద్ధి చేస్తుందని భావించ డం మనందరి పేరాశే అవుతుంది.
 
-కె.రాజశేఖరరాజు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement