
ఆదివాసులకూ సమాచార హక్కు
పోలవరం ప్రాజెక్టులో తాజాగా చేసిన మార్పుల వల్ల మునిగిపోయే గ్రామాల వివరాలను నెలరోజుల్లోగా తెలియజేయవలసి ఉంది.
విశ్లేషణ
పోలవరం ప్రాజెక్టులో తాజాగా చేసిన మార్పుల వల్ల మునిగిపోయే గ్రామాల వివరాలను నెలరోజుల్లోగా తెలియజేయవలసి ఉంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టుపైన ప్రజా విచారణ జరపాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌పైన ఉంది. పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోయే గ్రామాల ప్రజ లకు తెలుసుకునే హక్కు ఉం దని సమాచార హక్కు చట్టం కన్న చాలా ముందు 1986లో నే పర్యావరణ చట్టం చెప్పిం ది. ఫలానా గ్రామాలు మునిగి పోతాయి, పునరావాసం ఇది గో ఇదీ అని కొత్త ప్రాజెక్టులు కట్టే ముందు నష్టపోయే ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాలి. వారి అభిప్రాయాలను తీసుకోవాలి.
ఆ విధం గా ప్రజావిచారణ జరిపించారా, దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు కావాలని డి. సురేశ్ కుమార్ సహ చట్టం కింద కోరారు. పైగా, ప్రాజెక్టు డిజైన్ మార్చితే అదనంగా మునిగే గ్రామాలకు కూడా ఆ విషయాన్ని తెలియచెప్పాలి. పనుల నిలిపివేత ఉత్తర్వులకు సంబం ధించిన సంప్రదింపులు, లేఖలు మొదలైన పూర్తి సమా చారమివ్వాలని, కానీ అడిగినా ఆ సమాచారం తనకు ఇవ్వలేదని సురేశ్ ఫిర్యాదు చేశారు. మొదటి అప్పీలులో కూడా సమాచారం ఇవ్వలేదు. సరైన సిబ్బంది లేకపోవ డం వల్ల ఫైళ్లు వెతకలేకపోయామని పర్యావరణ మంత్రి త్వశాఖ సమాచార అధికారి తెలియజేశారు.
పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. తెలంగాణ నుంచి కొత్తగా తరలించిన గ్రామాలతోసహా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలోని అనేక ఆదివాసీ గ్రామాలు మునిగిపోతాయన్న ఆందోళన వల్ల ఈ ప్రాజెక్టు సమాచారం అత్యవసరమని సురేశ్ వాదిం చారు. 2005లో ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అను మతిని జాతీయ పర్యావరణ అప్పీలు ట్రిబ్యునల్ 2007 లో కొట్టి వేసింది. కాని ఈ తీర్పును పక్కనబెట్టి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్టు పర్యావరణ అనుమతిని బతికించింది.
అయినా గణనీయమైన మార్పులను చేసినందున పర్యావరణ అనుమతి గురించి 2009న మరోసారి పర్యా వరణ పరిశీలన సంఘం వారు సమగ్ర పరిశీలన జరి పారు. 2011లో ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ ప్రతి ఆరు నెలలకు ఒక ఆదేశం జారీ చేస్తూ పనులు కొనసాగి స్తున్నారని, ఆ వివరాలు తెలియజేయాలని సురేశ్ కుమార్ కోరారు. తాను ఏడు సహ దరఖాస్తులు చేస్తే ఐదింటిలో ఫైళ్లు దొరకడంలేదని చెప్పడం అన్యాయమ ని వాదించారు. ఇంత జాతీయ ప్రాధాన్యత ఉన్న ప్రాజె క్టు ఫైళ్లు జాగ్రత్తగా రక్షించకపోవడం సమంజసం కాదు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో పోలవరం పైన ప్రజా విచారణ జరపలేదన్న కారణంగా ప్రాజెక్టు పను లు నిలిపివేయాలన్న ఉత్తర్వులను మరో సంవత్సరం పాటు ఆపివేస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదే శించినట్టు ఆ శాఖ ప్రజాసమాచార అధికారి తెలియజే శారు. ప్రజావిచారణ ముగిసే దాకా పోలవరం జలాశ యం నింపకూడదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఇదివరకే ఆదేశించింది. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ జూలై 3, 2015 పనుల నిలిపివేత ఉత్త ర్వును తాత్కాలికంగా ఆపివేసే ఆదేశాన్ని జారీ చేసిన విషయం ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక లేఖలో తెలి పారు. మొదటి 3 నెలల్లో ప్రజా విచారణకు చర్యలు చేపట్టి 6 నెలల్లోగా ముగించాలని షరతు విధించారు.
పోలవరం ప్రాజెక్టుపైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అభ్యంతరాలకు ప్రజా విచారణ ద్వారా, చర్చల ద్వారా సరైన సమాధానాలు ఇవ్వవలసిన అవసరం ఉందని సీఎంకు కేంద్ర మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి బిశ్వ నాథ్ సిన్హా 23.6.2015 నాటి ఆఫీస్ మెమొరాండంలో గుర్తు చేశారు. ప్రజా విచారణ పూర్తయ్యే దాకా జలాశ యంలో జలం నింపబోమని ఇచ్చిన హామీని నిలబెట్టు కోవాలని కూడా చెప్పారు. ప్రజా విచారణలో వచ్చిన సూచనల మేరకు ప్రాజెక్టు డిజైన్‌లో ఆపరేటింగ్ పారా మీటర్లలో అవసరమనుకొని చేసిన మార్పులపైన కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు జరిపి, ఆయా రాష్ట్రాల అంగీకారాన్ని తీసుకోవాలని 2.4.1980 నాటి ఒప్పం దాన్ని పాటించాలని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు.
ఆ విధంగా చేసిన డిజైన్ మార్పులవల్ల ఈ రెండు రాష్ట్రాలలో అదనంగా గ్రామాలు మునగకుండా చూసు కోవలసిన బాధ్యత కూడా ఉంది. 2013 మార్చి 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ కేంద్ర పర్యా వరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ చట్టం 1986 సెక్షన్ 5 కింద తమ మంత్రిత్వశాఖ స్పష్టమైన అనుమతి లేకుం డా జలాశయాన్ని పూర్తి చేయడానికి వీల్లేదని ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వు మళ్లీ మార్చే దాకా అమలులో ఉండి తీరుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం 30 జూన్ 2015 వరకు ఈ ప్రాజెక్టుపైన 5,377 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపింది. ఈ లేఖ లన్నీ ప్రజలముందుంచాలి.
రికార్డులను కోల్పోవడం అంటే పబ్లిక్ రికార్డుల చ ట్టం, సమాచారహక్కు చట్టాలను ఉల్లంఘించడమే అవు తుంది. వెంటనే ఫైళ్లను వెతికి సమాచారం ఇవ్వాల్సిందే. సమాచార అధికారికి తగినంత సిబ్బందిని, వనరులను, సమయాన్ని కల్పించి ఫైళ్లు అందుబాటులోకి తేవడానికి సహకరించాల్సిన అవసరముంది. పోలవరం ప్రాజె క్టులో తాజాగా చేసిన మార్పులవల్ల మునిగిపోయే గ్రామాల వివరాలను నెలరోజుల్లోగా తెలపవలసి ఉంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టుపైన ప్రజావిచా రణ జరపాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌పైన ఉంది. పోల వరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్ట పభుత్వాలకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యు త్తరాల పత్రాలను స్వయంగా సహ చట్టం సెక్షన్ 4(1) (బి) కింద మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఉంచాలి.
మాడభూషి శ్రీధర్
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com.