ది కాపిటల్ స్టూడియో
శ్రీరమణ
భూములు ఇచ్చాక డబ్బులు రావేమోనని భయపడుతున్నారు. మోదీతో, వెంకయ్యనాయుడితో షూరిటీ సంతకాలు చేయిస్తే మాకేం అభ్యంతరం లేదన్నారు కొందరు.
మొదట్నించీ చంద్రబాబు ప్రపంచస్థాయి కాపిటల్ నిర్మి స్తాననీ, అదే మన రాష్ట్రానికి అన్నం పెడుతుందనీ చెబుతూ వస్తున్నారు. పదేళ్లపాటు హైద రాబాద్‌లోనే తలదాచుకునే ఇరువున్నా ఆయన సొంత గూ ట్లో ఉండి పాలన చేయడమే మర్యాదనే లెఖ్ఖలో ఉన్నారు. వస్తూనే వాస్తు ప్రకారం కృష్ణాతీరం అమోఘంగా ఉందని తీర్మానించారు. మహా కాపిటల్‌కి ముప్పైవేల ఎకరాలు అవసరమని నిర్ధారించారు. అప్పట్నించీ ఆ ప్రాంతంలో డేగలు తిరిగినట్టు హెలికాప్టర్లు తిరుగుతూ సర్వేలు చేస్తున్నాయి. తుళ్లూరు ప్రాంతం ఒక్కసారి సందడిమయమైంది. రకరకాల వదంతులు, రకరకాల ఊహాగానాలు. ఊహలకీ, భూమికీ రెక్కలు వచ్చేశాయి. అక్కడి భూయజమానుల జాతకాలు మారిపోయాయి.
అంటారుగానీ, అన్ని ఎస్టేట్లు రియల్ ఎస్టేట్ల తర్వా తే. మిగతా నాలుగూ సేవారంగాలు. ఇది పూర్తి వ్యాపా రరంగం. డబ్బు ఇక్కడున్నంత మరెక్కడా లేదు. యుద్ధాలు, దండయాత్రలు, ఆక్రమణలు అని పేర్లు పెట్టారు గానీ, మొత్తం అవన్నీ రియల్ ఎస్టేట్ దందాయే కదా! అశోకుడైనా, అలెగ్జాండరైనా నేల మీద కాంక్షతోనే కదా అంతంత యుద్ధాలకు తలపడింది! అమెరికాలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ‘‘త్వరపడండి! ఉత్పత్తి నిలిచి పోయింది. సరుకున్నంత వరకే’’ అంటూ వ్యాపార ప్రక టనలలో భూకొనుగోలుదారుని భయపెట్టింది. నిజమే, నేలని సాగదియ్యలేరు కదా! అందుకే పక్కలకి కాకుండా పైకి విస్తరిస్తున్నారు. కొన్ని లక్షల సంవత్సరాలకి పెట్రో లైనా పుడుతుందేమో కానీ అంగుళం నేల కూడా పుట్ట దు. అందుకే అంత గిరాకీ.
రాష్ట్ర రాజకీయం కొత్త కాపిటల్ చుట్టూ తిరుగు తోంది. ఇప్పుడా పచ్చని పంట భూములలో వందలాది ఖరీదైన కార్లు నిలబడి కనిపిస్తున్నాయి. తరచు గ్రామ కూడళ్లలో ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. అక్కడ గ్రామాల అరుగుల మీద, చెట్ల కింద దస్తావేజు రాయస కాళ్లు సరంజామాతో కనిపిస్తున్నారు. కొన్ని పెంకుటిళ్లు బార్ అండ్ రెస్టారెంట్లుగా మారాయి. తగిన జన సంచా రం, ధన ప్రవాహం ఉన్న చోటికి ఎలాంటి ఇండస్ట్రీలు వస్తాయో అవన్నీ అక్కడికి చేరిపోయాయి. అక్కడి వారి అవసరాలు పెరిగాయి. జీవన వ్యయం పెరిగింది.
జనసేన పవన్‌కల్యాణ్ అయిదారు గంటలు కాపి టల్ ప్రాంతమంతా పర్యటించారు. ప్రభుత్వం మీ దగ్గర బలవంతంగా భూములు లాక్కుంటే మీ వెంట నేనుం టానని హామీ ఇచ్చి, వారి వద్ద పెరుగన్నం తిని వెళ్లారు. అన్ని వేల ఎకరాలు ఒక కాపిటల్‌కి అవసరమా అని గిట్టని వారి ప్రశ్న. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు న్నారు, సింగపూర్‌కి పదివేల ఎకరాలు దోచి పెడుతు న్నారని ఆరోపణ. అక్కడి రైతులని అడిగితే ఏటా ఇస్తా మన్న రాయితీలు బాగున్నాయి, నష్ట పరిహారంగా ఇచ్చే స్థలాలు, వాటి విలువ కోట్లలో ఉంటుంది, మాకు సం తోషమే అంటున్నారు. కొందరు, తీరా భూములు ఇచ్చాక డబ్బులు రావేమోనని భయపడుతున్నారు. మోదీతో, వెంకయ్యనాయుడితో షూరిటీ సంతకాలు చేయిస్తే మాకేం అభ్యంతరం లేదన్నారు కొందరు.
పవన్ కల్యాణ్ ఆమరణ దీక్షకి మేం అవకాశం ఇవ్వం- అన్నా రు మరికొందరు. ‘‘వాళ్లూ వాళ్లూ ఒకటే గదండీ! చివ రకు చంద్రబాబుకు సపోటా ఇస్తాడండీ!’’ అన్నాడొక పెద్ద రైతు.
దేన్నైనా కాదనగలం గానీ ప్రపంచంలో రియల్ ఎస్టేట్‌కి ఎదురు నిలవలేం. ఒకవైపు మౌంట్ రోడ్డు, ఇంకోవైపు ఇంకో హైవే, ద్వీపంలా ఉన్న వంద ఎకరాల స్థలం పత్రికా నిర్వహణకి అవసరమా అని అడిగారు ఆ యజమానిని. ఆయన నవ్వి, ‘‘పత్రిక అమ్మితే వచ్చేది చిల్లర పైసలే. మహా మహా పేరున్న మహానుభావు లంతా వచ్చి అర్థరాత్రి దాకా పని చేసుకుంటూ నా ఎక రాలకి కాపలా కాస్తారు. తర్వాత పేపర్ పంపిణీదారులు తెల్లారేదాకా కాస్తారు. వాళ్లని ఈ వంకన కాపలాకి పెట్టు కున్నా’’ అన్నాడట. ఒకావిడ పవన్‌కల్యాణ్ వెళ్లగానే ఫోన్ చేసి మాట్లాడుతోంది, ‘‘బావున్నాడే! అచ్చం సిని మాలో లాగే ఉన్నాడు. ఇక్కడాయన స్టూడియో కడతా డంట! స్థలం చూసుకోను వచ్చాడంట! ఇక్కడ మనోళ్లు అనుకుంటన్నారు...’’ తర్వాత నాకేం వినపడలేదు.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)