టీడీపీ, బీజేపీల 'ఫ్లెక్సీ' లొల్లి | flexies couses tension between tdp and bjp activists sidelines of central ministers tour in amaravathi | Sakshi

టీడీపీ, బీజేపీల 'ఫ్లెక్సీ' లొల్లి

Dec 5 2015 10:39 PM | Updated on Mar 29 2019 9:31 PM

టీడీపీ, బీజేపీల 'ఫ్లెక్సీ' లొల్లి - Sakshi

టీడీపీ, బీజేపీల 'ఫ్లెక్సీ' లొల్లి

అమరావతిలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యల పర్యటన సందర్భంగా టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజుకుంది.

అమరావతి: వారసత్వ నగర పనుల ప్రారంభోత్సవానికిగానూ ఏపీ రాజధాని నగరం అమరావతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరయిన నేపథ్యంలో వారికి స్వాగతం పలికేందుకు టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి. గడిచిన రోజులుగా రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ అభిమాన నేతల ఫ్లెక్సీలను అమరావతికి వెళ్లే మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చిరుమామిళ్ల అశోక్ అధ్వర్యంలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకులకు స్వాగతం పలికే ఫ్లెక్సీలు, బ్యానర్లు పలుచోట్ల ఏర్పాటుచేశారు.

ఇటీవల బీజేపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు కొందరు..  స్థానిక బీజేపీ నేతలతో ఉన్న విభేదాల కారణంగా ఫ్లెక్సీలను, బ్యానర్లను కొన్నిచోట్ల తొలగించారు. దీనిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు, చిరుమామిళ్ల అశోక్ నిరసనకు దిగేందుకు సిద్ధమయ్యారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ముందు జాగ్రత్తగా అతన్ని అరెస్టు చేసేందుకు యత్నించారు. దీంతో బీజేపీ రాష్ట్ర నేత జమ్ముల శ్యాంకిషోర్, పెదకూరపాడు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి నలుబోలు విష్టు, బీజేపీ రాష్ట్ర ఐటీ విభాగం ఇన్‌చార్జి వైఎస్‌రావు తదితరులు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement