పాలకుల పాపం... పేద పిల్లలకు శాపం | there is no rte act in telugu states! | Sakshi
Sakshi News home page

పాలకుల పాపం... పేద పిల్లలకు శాపం

Published Tue, Mar 31 2015 12:45 AM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM

పాలకుల పాపం... పేద పిల్లలకు శాపం - Sakshi

పాలకుల పాపం... పేద పిల్లలకు శాపం

విద్యా హక్కు చట్టం (ఆర్ టీఈ) అమలులోకి వచ్చి నేటికి ఐదు వసంతాలు పూర్తయినా, తెలుగు రాష్ట్రాలలో అది అమలుకు నోచుకోలేదు.  సర్వశిక్షా అభియాన్ (ఎన్‌ఎస్‌ఏ) నిధులతో రెండు రాష్ట్రా ల్లోని సూళ్లకు మౌలిక సదు పాయాలొచ్చాయి. కానీ సక్సెస్ స్కూళ్లు, ఒకటో తర గతి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన, ఏటా శిక్షిత ఉపాధ్యాయ నియామకాలు, బడ్జెట్‌లో 10% నిధు లు, బడి మానేసిన వారి కోసం బ్రిడ్జి స్కూళ్లు, కస్తూ రిబా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూ ళ్లు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు... ఇలా ఎన్నో చర్యలు చేపట్టారు. అయినా 2003-04 నుంచి 2013-14 మధ్య దశాబ్ద కాలంలో 25 లక్షల మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్ల బాట పట్టారు. ఉమ్మ డి రాష్ట్ర ప్రైవేటు విద్యార్థుల సంఖ్య 32.78 లక్షల నుంచి 57.48 లక్షలకు చేరింది. అలాగే ప్రైవేటు స్కూళ్ల సంఖ్య 12,573 నుంచి 25,302కు చేరింది. అలా అని ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య తగ్గలేదు. పైగా నిధులు, సౌకర్యాలు బాగా పెరిగాయి. కానీ పాలకులలో, ఉపాధ్యాయులలో అంకితభావం లేకపోవడం వలన వేల కోట్ల రూపా యల ప్రజాధనం నిరుపయోగమవుతోంది. జాతీ య అక్షరాస్యత 73% శాతం కాగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అది 67.2%. బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలకు వెనుకే.


 విద్యా హక్కు చట్టం-2010 సెక్షన్-12(సి) ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. ఆ 25 శాతం విద్యా ర్థుల ఫీజులను రీయింబర్స్‌మెంట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలి.
 
 అంటే తెలుగు రాష్ట్ర ప్రభు త్వాలపై రూ.400 కోట్ల భారం. సర్వశిక్షా అభి యాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ల అమ లుతో చాలా స్కూళ్లకు కొత్త భవనాలు ఏర్పాటయ్యా యి. విద్యాహక్కు అమలు వల్ల ఏ ఒక్కటీ నిర్మాణం కాలేదు. ఉపాధ్యాయులపై పర్యవేక్షణ చేసే అధి కారులు లేరు. పాఠశాలల పర్యవేక్షణకు మండల విద్యాధికారులను, డిప్యూటీ విద్యాధికారులను నియమించడంపై పాలకులు ఆసక్తి చూపడం లేదు. దీంతో విద్య, బోధన ప్రమాణాల పెంపుదలను పట్టించుకునేవారే లేకుండాపోయారు. తెలంగాణ లోని 10 జిల్లాలో 462 మంది మండల విద్యాధికా రులు ఉండాల్సి ఉండగా 42 మంది, 67 మంది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకుగానూ 8 మంది ఉన్నారు. 59 డిప్యూటీ ఈఓ పోస్టులు, 420 మండల విద్యాధికారుల పోస్టులను భర్తీ చేయడం లేదు. ఒక్క టీచర్ మాత్రమే ఉన్న స్కూళ్లు 3,895. రెండు వేల స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు లేరు. దీనికి తోడు బదిలీల వల్ల 717 స్కూళ్లలో టీచర్లు లేరు. ఈ దుస్థితిలో 8వ తరగతిలోపు 32.56% బడి మానేయడంలో ఆశ్చ ర్యం లేదు. వీటన్నిటికి తోడు ఈ ఆర్థిక సంవత్స రంలో కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లు విద్యకు నిధులలో కోత విధించాయి. ఇన్ని దుర్భర పరిస్థితులలో, ప్రభుత్వ పాఠశాలలు ఎలా బతికి బట్టకట్టాలి?   
 
 ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదవా రికి ఇవ్వాలనే విద్యా హక్కు చట్ట నిబంధన అర్థరహి తమైనది. నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందిస్తూ అద్భుత ఫలి తాలను సాధిస్తున్నాయి. అలాంటి స్కూళ్ల సంఖ్యను పెంచడం అన్నివిధాల ఉత్తమం. పేద విద్యార్థులను ప్రైవేట్ స్కూళకు పంపడం వల్ల ప్రజాధనం దుర్వి నియోగం కావడమేకాదు, అక్కడ వాళ్లు వివక్షను చవిచూడాల్సి వస్తోంది. అయినా లెక్కచేయక మన ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యాసంస్థలకు మేలు చేకూ ర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ, పేదలకు విద్యను అందకుండా చేస్తున్నారు. ఇకనైనా తెలుగు పాలకులు ప్రైవేటు విద్యా సంస్థల సేవ మాని, అన్ని స్థాయిలలోని అధి కారులను, ఉపాధ్యాయులను సకాలంలో నియమిం చాలి. ప్రత్యేకించి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి విధిగా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని శాసించి, కచ్చితంగా అమలు చేయాలి. అప్పుడే అం దరికీ నాణ్యమైన విద్యకు హామీ.   
 
 (విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి
 నేటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా...)
 (వ్యాసకర్త ‘సోషల్ ఎవేర్‌నెస్ కాంపెయిన్’ ప్రతినిధి. మొబైల్ నం: 9441048958)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement